ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాలని లేకపోతే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కేసీఆర్ పిలుపునిచ్చారు ఈ మేరకు కరీంనగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో నిరసన దీక్ష చేశారు తర్వాత ఆయన మాట్లాడుతూ రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని వెంటనే రైతుబంధు నిధులు కర్షకుల ఖాతాలో జమ చేయాలని రైతులకి హామీ ఇచ్చిన విధంగా నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ధాన్యానికి మద్దతు ధర అందించడంతో పాటు 500 రూపాయల బోనస్ చెల్లించాలని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలన వలన రైతులు సాగునీరు అందక పంట నష్టం కలుగుతుందని పంట నష్టపోయిన రైతులకు ఎకరాకి 25 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు.