టీడీపీకి మరో షాక్.. రేపు వైసీపీలోకి గన్నవరం మాజీ ఎమ్మెల్యే…!

-

ఇప్పటికే టీడీపీకి చెందిన చాలా మంది నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే బాల వర్థన రావు వైసీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారట.

టీడీపీకి భారీ షాక్ తగిలింది మళ్లీ. ఇప్పటికే టీడీపీకి చెందిన చాలా మంది నేతలు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా సినీ నటి జయసుధ కూడా వైసీపీలో చేరారు. జయసుధ చేరిన కొద్ది గంటలకే టీడీపీకి చెందిన మరో నేత వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు.

తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే బాల వర్థన రావు వైసీపీలో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారట. ఆయన టీడీపీకి రాజీనామా చేసి రేపు వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారట.

ఆయనే కాదు నంద్యాల సిట్టింగ్ ఎంపీ ఎస్పీవై కూడా త్వరలోనే వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో బాబుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.

ఇవి చ‌ద‌వండి

మ‌న‌లోకం’ చెప్పిన‌ట్లే.. వైసీపీలో నాయ‌కుల చేరిక‌లు.. క‌చ్చితత్వంతో కూడిన వార్త‌లే మా లక్ష్యం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version