గ్రేటర్‌ ఎన్నికల వేడి.. కండువాలు మారుస్తున్న కీలక నేతలు..

-

గ్రేటర్‌లో నామినేషన్ల గడువు నిన్నటితో ముగియటంతో ఇప్పుడు ప్రధాన పార్టీలకు బీ ఫారాల తలనొప్పి మొదలైంది..ఈ రోజు సాయంత్రం లోపు బీ ఫారాలు ఎన్నికల అధికారులకు సమర్పించాలి పోటీ చేస్తున్న అభ్యర్థులు..దీంతో పార్టీల్లో అసంతృప్తుల సంఖ్య భారీగానే పేరుగుతుంది..బీ ఫారాలు ఇవ్వని అభ్యర్థులతో పార్టీలకు ఆయారాం..గయారాంల బెడద అధికమైంది..పార్టీ టికెట్లు ఆశించి భంగపడిన నేతలు..వెంటనే పార్టీ మార్చేస్తున్నారు. వారిని బుజ్జగించడం, అభ్యర్థులకు తలకుమించిన భారంలా మారింది..దీంతో పార్టీల పెద్దలు రంగంలోకి దిగి, హామీల వర్షం కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది..

గ్రేటర్‌లో నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రచార హీట్ తారాస్థాయికి చేరింది..పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం జరిగిపోయింది..ఇంకేముంది టికెట్‌ గురించి ఆశించి భంగపడిన అసంతృప్తులు.. నిరసనలకు దిగారు. మరికొందరు పార్టీతో లాభం లేదని, కండువాలు మార్చేస్తున్నారు.. పెద్దసంఖ్యలో చోటా, మోటా నేతలు.. పార్టీలు మారుస్తుండడంతో, గెలుపు అవకాశాలపై అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తోంది. దీంతో అభ్యర్థులు నేరుగా అసంతృప్తులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు పార్టీల ముఖ్యులు కూడా .. బుజ్జగింపుల పర్వాన్ని కొనసాగిస్తున్నారు.

ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీనేత, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ..బీజేపీలో చేరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్..సర్వే ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. బీజేపీలో చేరేందుకు ఇదే సరైన సమయమన్న సర్వే సత్యనారాయణ..ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరుతానన్నారు. హైకమాండ్‌తో మాట్లాడి ఏం చేస్తానో చెప్తానని వివరించారు సర్వే.

అభ్యర్థుల బీ ఫారాల విషయంలో అసంతృప్తి చెందిన గ్రేటర్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌ కుమార్‌ యాదవ్‌ పార్టీకి రాజీనామా చేస్తానని అధిష్టానాన్ని బెదిరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌ గౌడ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు.ఎటు తేల్చుకోని స్థితిలో కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు..మరోవైపు తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్నవార్తలను..కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి ఖండించారు.తనపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని.. తాను పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.దీనికిసంబంధించి ఓట్వీట్‌ కూడా చేశారు..ఉదయం ఓ పార్టీ కండువా, మధ్యాహ్నం మరో పార్టీ కండువా, రాత్రికి ఇంకో పార్టీ కండువా కప్పుకుంటూ.. చోటా, మోటా నేతలు..అభ్యర్థులకు చెమటలు కక్కిస్తున్నారు. దీంతో తమతో ఉండేదెవరో అర్థం కాక తల పట్టుకుంటున్నారు.

టీఆర్‌ఎస్‌,బీజేపీలో కూడా రెబల్స్‌ బెడద ఎక్కవే ఉంది..టిక్కెట్ ఆశించి భంగపడిన అభ్యర్థులు పార్టీల ఆఫీస్ ముందు ఆందోళనలు చేస్తున్నారు..టిక్కెట్ పొందిన వారిపై ప్రత్యేక్షంగానే ఆరోపణలు చేస్తున్నారు..ఎంతక కాలంగా పార్టీ కోసం పని చేస్తున్న నేతలు డబ్బులకు టిక్కెట్లను అమ్ముకున్నారని మీడియా ముందే ఆరోపిస్తున్నారు..ఏదేమైనా ప్రధాన పార్టీలకు రెబల్స్ బెడద బాగానే ఉందన్నట్లు తెలుస్తుంది..చివరికి వారి తిరుగుబాటు ఏ పార్టీకి లాభం చేకురుస్తుందో డిసెంబర్‌ 4 తేదివ వరకూ ఆగక తప్పదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version