కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే తాజాగా.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కూడా ఈ మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ మీద పడింది.
ఎందుకంటే.. ఈ నెల 19 న గజేంద్ర సింగ్ షేకావత్ తో కలిసి ఒక సమావేశంలో పాల్గొన్నారు మనోహర్ లాల్. అలాగే గత కొంత కాలంగా ఆయన కలిసిన వారిలో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఇప్పటికే కరోనా టెస్ట్ చేయించుకోగా ఆయనకి నెగిటివ్ వచ్చింది. అయినాసరే, ముందు జాగ్రత్తగా 3 రోజులు హోం క్వారంటైన్ లో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు.