ఆ ముగ్గురి చేతిలో ఆరోగ్య‌శాఖ‌!

-

తెలంగాణ‌లో ఇప్పుడు ఆరోగ్య‌శాఖ ఎవ‌రి చేతిలో ఉంది అంటే సీఎం కేసీఆర్ చేతిలో అని చెప్తారా అయితే మీరు చెప్పింది త‌ప్పు. ఇప్పుడు ఆరోగ్య‌శాఖ ముగ్గురి చేతుల్లో ఉంది. ఏంటి న‌మ్మ‌ట్లేదా నిజ‌మండి. ఒక్క‌రు చూసుకుంటే ఇబ్బంద‌వుతుంద‌నుకున్నారో ఏమో గానీ ప్ర‌స్తుతం ఆరోగ్య‌శాఖ‌ను సీఎ కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, మంత్రి హ‌రీశ్‌రావులు చూసుకుంటున్నారు.

 

అదెలా అంటే వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రిగా సీఎం కేసీఆర్‌, డీ ఫ్యాక్టో ఇన్‌చార్జి మంత్రిగా హ‌రీశ్‌రావు, కొవిడ్ టాస్క్ ఫోర్స్ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. సీఎం కేసీఆర్ కొవిడ్ కంట్రోల్‌కు స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

అలాగే ప్ర‌ధానితో జ‌రిగే ప్ర‌తి వీడియో కాన్ఫ‌రెన్స్‌లో సీఎం కేసీఆర్ పాల్గొంటున్నారు. ఇక హ‌రీశ్‌రావు డీ ఫ్యాక్టో ఇన్‌చార్జిగా ఆక్సిజ‌న్ స‌ప్ల‌య్‌, వ్యాక్సిన్ల కొర‌త రాకుండా చూసుకుంటున్నారు. కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రిహ‌ర్ష‌వ‌ర్ధ‌న్ తో జ‌రిగే మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇక టాస్క్‌ఫోర్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా మంత్రి కేటీఆర్ హాస్పిట‌ళ్ల‌లోని వ‌స‌తుల‌ను చూసుకుంటున్నారు. ఎక్క‌డ ఏ ఇబ్బంది వ‌చ్చినా వెంటనే స్పందిస్తున్నారు. మొన్న‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్ ఒక్క‌డే ఇవ‌న్నీ చూసుకున్నాడు. కానీ ఇప్పుడు ముగ్గురు చూసుకుంటున్నారు. మ‌రి ఆరోగ్య‌శాఖ‌ను ఫైన‌ల్‌గా ఎవ‌రి చేతిలో పెడుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version