వైసీపీ ప్ర‌భుత్వంలో భారీగా నామినేటెడ్ ప‌ద‌వులు.. త్వ‌ర‌లోనే వారికి ఛాన్స్‌!

-

వైసీపీ నేత‌ల‌కు ఎట్ట‌కేల‌కు గుడ్ న్యూస్ చెప్పింది ప్ర‌భుత్వం. త్వ‌ర‌లోనే పార్టీలో పెద్ద ఎత్తున ప‌ద‌వుల బాట ప‌ట్ట‌నున్నారు జ‌గ‌న్‌. ఇందుకోసం అధిష్ఠానం అన్నిరకాలుగా రంగం సిద్ధం చేస్తోంది. ప్ర‌భ‌త్వంలో ఉన్న వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లు, ఇత‌ర డైరెక్టర్ల ప‌ద‌వులు నింపేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది ప్ర‌భుత్వం. పార్టీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు గ‌డుస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌ద‌వును భ‌ర్తీ చేయ‌లేదు జ‌గ‌న్‌.

కాగా ప‌ద‌వులు లేని కీల‌క నేత‌లంద‌రికీ గుడ్ న్యూస్ చెప్పేందుకు 70 కార్పొరేషన్ చైర్మన్ సీట్లు, ఇత‌ర కార్పొరేషన్‌‌లకు 840 వ‌ర‌కు డైరెక్టర్ల పదవులు నింపేందుకు జ‌గ‌న్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఇవ‌న్నీ నామినేషన్ పోస్టులు కావ‌డం గ‌మ‌నార్హం. వీటిని ఎవ‌రికి ఇవ్వాల‌నే దానిపై జ‌గ‌న్ పక్కా ఫార్ములా ప్ర‌కారం వెళ్తున్నారు.

కాగా ఈ ప‌ద‌వుల‌ను మూంచెలుగా విభ‌జించి భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయిన వారికే ఇవ్వ‌నున్నారంట‌. ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ ను ఇత‌రుల‌కు ఇవ్వడానికి సిద్ధ‌ప‌డ్డ వారికి ఛాన్స్ ఉంటుంది. ఇక పార్టీని న‌మ్ముకుని ఉంటున్న‌ సీనియర్లకు చివ‌రి అవ‌కాశం ఇస్తార‌ని స‌మాచారం. ఇంకోవైపు గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ రాని అభ్య‌ర్థుల‌కు కూడా ఛాన్స్ ఇస్తార‌ని తెలుస్తోంది. పోస్టులు ఎక్కువ‌గా ఉండ‌టంతో వారంద‌రికీ ఛాన్స్ ద‌క్క‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version