భలే ఉంది కదా. ఇప్పటి వరకు భర్తభర్యాలు రెండు పదవులను చేపట్టడం చూశాం కానీ.. ఇద్దరు పోటీగా వచ్చిన సందర్భాలు చాలా అరుదు.
ఏపీలో రాజకీయాలు యమరంజుగా ఉన్నాయి ప్రస్తుతం. ఇంకో 12 రోజుల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. అయితే.. ప్రచారం సంగతి.. ప్రధాన పార్టీలు ఒకరిని మరొకరు తిట్టుకోవడం.. అవన్నీ కామనే కానీ.. ఒక అన్ కామన్ సంగతి చెప్పుకుందాం ఇప్పుడు.
అదే భార్యాభర్తలు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం అవును.. భర్త, భార్య ఇద్దరు ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు.. భలే ఉంది కదా. ఇప్పటి వరకు భర్తభర్యాలు రెండు పదవులను చేపట్టడం చూశాం కానీ.. ఇద్దరు పోటీగా వచ్చిన సందర్భాలు చాలా అరుదు.
వాళ్లలో భర్త వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా.. భార్య మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తోంది. కృష్ణా జిల్లా పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించే మనం మాట్లాడుకునేది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొలుసు పార్థసారథి బరిలో ఉన్నారు. ఆయన భార్య కమల కూడా అదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కమలకు రిటర్నింగ్ అధికారి గుర్తు కూడా కేటాయించారు. ఆమెకు బెల్టు గుర్తును కేటాయించారు.
మీకు ఇంకో విషయం చెప్పాలి.. వీళ్ల కొడుకు నితిన్ కృష్ణ కూడా అదే నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశాడు. కానీ.. ఆయన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. ఒకే నియోజకవర్గం నుంచి భార్యాభర్తలు పోటీలో ఉండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే.. వీళ్లే కాకుండా పెనమలూరు నియోజకవర్గం నుంచి మరో 11 మంది బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, వైసీపీ నుంచి పార్థసారథి, జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి లంకా కమలాకర్ రాజు పోటీలో ఉన్నారు. పోటీ కూడా ప్రధానంగా ఈ ముగ్గురు మధ్యే ఉంది.