‘ప్రియాంకా గాంధీ’ అందంగా ఉంటుంది.. సినిమాల్లోకి వచ్చి ఉంటేనా…!

-

ప్రియాంకా గాంధీ.. చాలా అందంగా ఉంటుంది. ఆమె మంచి అందగత్తె. ఆమె సినిమాల్లో నటించి ఉంటే బోలెడు ఆఫర్లు వచ్చి ఉండేవి… అంటూ సెంట్రల్ షియా వక్ఫ్ బోర్డ్ చీఫ్ వసీం రిజ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.

shia-central-waqf-board-chairman-waseem-rizvi-sensational-comments-on-priyanka-gandhi

ప్రియాంకా గాంధీ ఒకవేళ సినిమాల్లోకి వచ్చి ఉంటే నేను రామ్ కీ జన్మభూమి అనే సినిమాలో జాఫర్ ఖాన్ భార్య పాత్రను ఆమెకు ఇచ్చేవాడిని. అది నేను తీసిన సినిమానే. ముస్లిం యువతి పాత్రకు ఆమె కరెక్ట్ గా సెట్ అయ్యేది.. అంటూ రిజ్వీ వెల్లడించాడు. రామ్ కీ జన్మభూమి సినమాలో ముస్లిం యువతి పాత్రను నజ్ నీన్ పట్నీ పోషించింది.

shia-central-waqf-board-chairman-waseem-rizvi-sensational-comments-on-priyanka-gandhi

ప్రియాంకా గాంధీ ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. యూపీ ఈస్ట్ కు ఇన్ ఛార్జ్ గానూ వ్యవహరిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆమె ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు.

అయితే.. రిజ్వీ కామెంట్స్ పై యూత్ కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక మహిళా నేతను పట్టుకొని రిజ్వీ అవమానించారంటూ… అతడిపై సెక్షన్ 354, 309 చట్టాల ప్రకారం కేసు నమోదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news