ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్నీ హుజూరబాద్ చుట్టూనే ప్రదక్షిణలు చేస్తున్నాయి. కీలక నేతలంతా అక్కడే మకాం వేశారు. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ ఎస్, బీజేపీ హోరా హోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. అయితే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ఓ సమాచారం బయటకు వచ్చింది.
ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది తేలకున్నా.. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం మండలానికో ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ పార్టీ నేతలకు మాత్రం అసలు ఎన్నికలు ఎప్పుడొస్తాయనేదానిపై ఇంటిమేషన్ వెళ్లినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కరోనా తగ్గడంతో సెప్టెంబర్ నెలలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం. అక్టోబర్ లో ఎలాగూ థర్డ్ వేవ్ వచ్చే సూచనలు ఉన్నందున సెప్టెంబర్‌లోననే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆలోపు తమ అభ్యర్థిని కూడా కన్ఫర్మ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక టీఆర్ ఎస్ కు కూడా ఆలోపు పాజిటివ్ టాక్ తెచ్చుకోవాలని చూస్తోంది. చూడాలి మరి ఎన్నికలు ఎలా ఉంటాయో.