ఎం‌ఐ‌ఎం అడ్డాగా హైదరాబాద్..కమలం చెక్ పెడుతుందా?

-

హైదరాబాద్..తెలంగాణకు రాజధాని..కానీ ఎం‌ఐ‌ఎం పార్టీకి రాజకీయ రాజధాని అన్నట్లు ఉంది. మొదట నుంచి హైదరాబాద్ ఎం‌ఐ‌ఎం పార్టీకి అడ్డాగా ఉందని చెప్పాలి. ఏదో మొదట్లో మాత్రమే హైదరాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలిచింది..కానీ 1989 నుంచి అక్కడ ఎం‌ఐ‌ఎం హవా నడుస్తోంది. 1989, 1991, 1996, 1998, 1999 ఎన్నికల్లో ఎం‌ఐ‌ఎం తరుపున సలాహుద్దీన్ ఒవైసీ గెలిచారు.

ఇక 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా అసదుద్దీన్ ఒవైసీ గెలిచారు. నెక్స్ట్ ఎన్నికల్లో కూడా అసదుద్దీన్ గెలుపుని ఆపడం కష్టమే అని చెప్పవచ్చు. హైదరాబాద్ ఎంపీ స్థానంలోనే కాదు..ఆ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో కూడా ఎం‌ఐ‌ఎం హవా నడుస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో చాంద్రాయణగుట్ట, ఛార్మినార్, గోషామహల్, బహదూర్‌పురా, యాకుత్‌పురా, కార్వాన్, మలక్‌పేట్ స్థానాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క గోషామహల్ మినహా మిగిలిన స్థానాలని ఎం‌ఐ‌ఎం గెలుచుకుంది.

ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సైతం గోషామహల్ మినహా మిగిలిన స్థానాల్లో ఎం‌ఐ‌ఎం పార్టీకి ఆధిక్యం వచ్చింది. దాదాపు 2.82 లక్షల మెజారిటీతో బీజేపీపై అసదుద్దీన్ గెలిచారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆ ఆరు స్థానాల్లో ఎం‌ఐ‌ఎం హవా నడిచేలా ఉంది. ఒకటి రెండు చోట్ల మాత్రం బి‌జే‌పి గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయింది గాని..అనుకున్న మేర ఎం‌ఐ‌ఎం పార్టీని నిలువరించడం మాత్రం కష్టమని చెప్పాలి. ఇక హైదరాబాద్ ఎంపీ స్థానం మాత్రం ఎం‌ఐ‌ఎం ఖాతాలో పడటం ఖాయమనే చెప్పాలి.

అయితే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే ఆరు స్థానాలతో పాటు..సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉండే నాంపల్లి సైతం ఎం‌ఐ‌ఎం కంచుకోటగా ఉంది. కానీ ఈ సారి అక్కడ ఎం‌ఐ‌ఎం పార్టీకి కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇస్తుంది. మొత్తానికైతే హైదరాబాద్ ఎం‌ఐ‌ఎం అడ్డా అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version