అప్పుడు నేను కూడా రాజకీయ సన్యాయం తీసుకుంటా: స్మృతి ఇరానీ

-

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధాని మోదీ రాజకీయాల నుంచి తప్పుకుంటే తాను క్షణంగా కూడా రాజకీయాల్లో ఉండనని.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని వ్యాఖ్యానించారు. పూణేలోని వర్డ్స్ కౌంట్ ఫెస్టివల్ లో పాల్గొన్న పై వ్యాఖ్యలు చేశారు.

నేను ఎప్పుడూ చరిష్మా గల నాయకుల దగ్గర పని చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. వాజ్ పేయి నాయకత్వంలో పని చేయడం నా అదృష్టం. ఇప్పుడు మోదీజీ నాయకత్వంలో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు ప్రధాని మోదీలా ప్రధాన సేవకులు అని పిలుపించుకోవాలని లేదు. కానీ.. ఏనాడైతే ప్రధాని మోదీ రాజకీయాలను వదిలేస్తారో.. నేను కూడా అప్పుడే భారత రాజకీయాలను వదిలేస్తా. ఈ దేశానికి నేను ఎంత ఇవ్వగలనో నేనే నిర్ణయించుకుంటా. ఈ స్వతంత్ర దేశంలో నాకు నేనుగా నిర్ణయం తీసుకోలేకపోతే.. ఆ స్వాతంత్ర్యానికి అర్థం ఏముంటుంది. మోదీకి ఈ దేశాన్ని ఇంకా చాలా ఏళ్ల పాటు పాలించే సత్తా ఉంది.. అంటూ పలు ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version