చైనా బోర్డర్ ఇష్యూ : మేజర్ జనరల్స్ భేటీ.. ఆ ప్రస్తావన రాలేదట !

-

భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితిపై ఇరు దేశాల మేజర్ జనరల్‌ స్థాయి అధికారులు సమావేశం అయి చర్చలు జరిపారు. నిన్న ఉదయం 11 గంల నుంచి దౌలత్ బేగ్ ఓల్డీ (డిబిఓ) వద్ద ఇరు దేశాల ఆర్మీ అధికారులు డెప్సాంగ్ వద్ద పరిస్థితి మీద చర్చించినట్టు చెబుతున్నారు. దాదాపు 10 గంటలకు పైగా రెండు దేశాల వారి మధ్య చర్చలు జరిగినట్లు తెలిపిన ఆర్మీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. సరిహద్దుల్లో పెట్రోలింగ్ విధానాలపై సాధారణ చర్చలు జరిపినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చర్చల్లో బలగాల ఉపసంహరణపై ఎలాంటి ప్రస్తావన రాలేదని చెబుతున్నారు. వ్యూహాత్మక ‘డెప్సాంగ్’ మైదానాలకు సంబంధించిన సమస్యలపై చర్చించడానికే భారత్, చైనా ‘మేజర్ జనరల్’ స్థాయిలో భేటీ జరిపినట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకు జరిగిన కమాండర్‌ స్థాయి సైనిక చర్చల్లో గల్వాన్ లోయ, గోగ్రా హాట్‌ స్ప్రింగ్స్, పాంగోంగ్ త్సో లోని ఫింగర్ స్టాండ్‌ఆఫ్ ప్రాంతాలపైనే చర్చించినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఉద్రిక్తత పెరిగిన తరువాత తొలిసారిగా డెప్సాంగ్ మైదానాల పెట్రోలింగ్‌ విధానాలపై రెండు దేశాల సైనికాధికారులు చర్చించారు. డెప్సాంగ్ కొత్తగా 2020 లో ప్రారంభమైన సమస్య కాదని, అక్కడ ఉండే సాధారణ సమస్యలపై చర్చించడానికి ఇలాంటి సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతాయని ఆర్మీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. తూర్పు లడఖ్‌లోని సరిహద్దు నియంత్రణ రేఖ-ఎల్‌ఎసి వెంట కొనసాగుతున్న ప్రతిష్టంభనలో పాంగోంగ్ త్సోతో పాటు డెప్సాంగ్ మైదానాలు కూడా ఉన్నాయి. జూన్ 15న గాల్వన్ వద్ద హింసాత్మక ఘర్షణ తరువాత కల్నల్స్, బ్రిగేడియర్స్, మేజర్ జనరల్-స్థాయి సమావేశాలను నిలిపివేసి సైనిక కమాండర్ స్థాయికి మాత్రమే ఇరు దేశాలు పరిమితం చేశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version