ఈ దశ దాటకుండా చూసుకోవడమే తదుపరి లక్ష్యం .. ఎట్టి పరిస్థితి లో  లాక్ డౌన్ తీయకూడదు ?

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిలో నాలుగు కీలక దశలు ఉన్నాయి. తొలిదశలో విదేశాల నుండి వచ్చిన వాళ్లకు మాత్రమే కరోనా పాజిటివ్ వస్తుంది. రెండో దశలో కరోనా వైరస్ బారినపడిన వ్యక్తి ద్వారా కుటుంబ సభ్యులకు సోకటం, మూడో దశ చాలా ప్రమాదకరం…పెద్ద ఎత్తున వైరస్ సోకే ప్రమాదం. ఇక నాలుగో దశలో అయితే మరణాలు వినాశనమే.కాగా ప్రస్తుతం దేశంలో చాలా వరకూ నమోదైన పాజిటివ్ కేసులు విదేశాల నుండి వచ్చిన వాళ్ళ వే. ఢిల్లీ నిజాముద్దీన్ మత ప్రార్థనలలో పాల్గొన్న సభ్యులకు విదేశాలనుండి వచ్చిన వారి వల్ల కరోనా వైరస్ సోకటం తో దేశంలో ఒక్కసారిగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. ప్రస్తుతం కట్టుదిట్టంగా లాక్ డౌన్ అన్ని రాష్ట్రాలలో అమలు అవుతున్న 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదవుతున్నాయి.

 

ప్రభుత్వ యంత్రాంగాలు అన్ని శక్తికి మించి కష్టపడి పని చేస్తున్నాయి. అయినా దేశంలో ప్రస్తుత పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఇలాంటి టైమ్ లో లాక్ డౌన్ ఎత్తివేస్తే దేశం ప్రమాదకర జోన్ లోకి వెళ్లి పోవడం గ్యారెంటీ అని అంటున్నారు. ప్రజెంట్ రెండో దశ చివరిలో భారతదేశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాబట్టి లాక్ డౌన్ ఎత్తి వేయకుండా జూన్ నెలాఖరు వరకు కొనసాగిస్తే చాలా వరకు భారతదేశం కరోనా వైరస్ పై జరిగే యుద్ధంలో గెలిచినట్లే అని అంటున్నారు. మూడోదశ దాటకుండా చూసుకోవటం ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న లక్ష్యం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంటోంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version