భిన్నత్వంలో ఏకత్వం అనే మాటను భారతీయులు మరోసారి నిరూపించారు. అనేక భాషలు, ప్రాంతాలు, మతాలు, కులాలు, సంప్రదాయాలు, సంస్కృతుల సమ్మేళనమే భారతదేశం. అనేక అభిరుచులకు నిల యం ఈ దేశం. అంతేకాదు, అనేక తరహా వ్యక్తుల సమాహారం కూడా! అలాంటి దేశంలో ఎంత మంది ఎ న్ని రకాలుగా ఉన్నా.. ఏదైనా సమస్య దేశాన్ని చుట్టుముట్టినప్పుడు, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవస రం వచ్చినప్పుడు.. ఈ మతాలు, కులాలు, సంస్కృతులు, సంప్రదాయాలు అన్నీ ఏకమైపోతాయి. ఆ సమ యానికి అందరూ ఒక్కటిగా నిలుస్తారు. మేమంతా ఒక్కటే అనే భావనను ప్రపంచానికి చాటుతారు.
స్వాతంత్రోద్యమ సమయంలోనే కాకుండా తర్వాత కాలంలో కూడా అనేక సందర్భాల్లో ప్రజలు ఒకే మాట పై నిలబడ్డారు. దేశం కోసం తన స్వరం వినిపించారు. ఇప్పుడు కూడా దేశంలో ప్రజలంతా ఒకే మాటపై కి వ చ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా ప్ర జలు స్వచ్ఛందంగా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంట ల వరకు కూడా దేశవ్యాప్తంగా ప్రజలు 14 గంటల పాటు స్వచ్ఛంద కర్ప్యూను పాటించనున్నారు. అయితే, మిగిలిన సందర్బాలకు ఇప్పుడు జరుగుతున్న కర్ప్యూకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని చెబున్నారు.
కరోనా ఎఫెక్ట్ ఇంకా ఈ దేశంలోకి అడుగు పెట్టకముందు.. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం సహా పౌర న మోదు జాబితా(సీఏఏ, ఎన్నార్సీ)లపై అన్ని రాష్ట్రాల్లోనూ ముస్లింలు తీవ్రస్థాయిలో విజృంబించారు. దీం తో దేశవ్యాప్తంగా ఓ విధమైన అలజడి నెలకొంది. మరో మాటలో చెప్పాలంటే.. దేశమే రెండుగా చీలిపో యిందా? అనే పరిస్తితి ఏర్పడింది. ఒకవైపు ముస్లింలు, మరో వైపు మిగిలిన వారుగా దేశం చీలిపోయింది. అదేసమయంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి కూడా పడింది.
ఇక, ఈ ఆందోళనలను సమర్ధించేవారు, వ్యతిరేకించేవారు కూడా రెండు గా చీలిపోయారు. ఇలాంటి తరుణంలో దేశంలోకి అడుగు పెట్టిన కరోనా.. ఇప్పుడు అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చింది. ప్రబుత్వాలు చేయాల్సిన పని కన్నా. తమలో తాము చైతన్యం అయ్యేందుకు ప్రజలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు ఆదివారం అన్ని ప్రాంతాల్లోనూ విజయవంతం అయింది. కుల మత, జాతి, లింగ బేదం లేకుండా ప్రతి ఒక్కరూ జనతా కర్ప్యూను విజయవంతం చేశారు.