తెలంగాణాలో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మేరకు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ నెల 31 అంతరాష్ట్ర బస్ సర్వీసులను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. కాసేపట్లో ముఖ్యమంత్రి కెసిఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. మహారాష్ట్ర సరిహద్దులను తెలంగాణా ప్రభుత్వం మూసి వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణా సరిహద్దులను, చత్తీస్గఢ్ సరిహద్దులను కూడా మూసి వేయనున్నారు. ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. జనతా కర్ఫ్యూ ని కేంద్ర ప్రభుత్వం 14 గంటలు చెప్పగా కెసిఆర్ 24 గంటల వరకు పొడిగించారు. కాగా జనతా కర్ఫ్యూ కారణంగా ఆర్టీసి సర్వీసులను తెలంగాణా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.