పోయే కాలం వచ్చిన ఆ నాయకుల ఆశ చావనంటుందే !

-

పోయే కాలం వచ్చింది అంటారు.. కానీ పదవి కాలం అయిపోతుంటే వాళ్ళకి ఆశలు పెరిగి పోతున్నాయి. అంటే పోతూ పోతూ ఊరికే పోం అన్నట్లుగా ఉంది వాళ్ళ వ్యవహారం. పోతూ పోతూ ఐ ఫోన్ పై ఆశ పుట్టింది. కొత్త వాళ్ళు గెలిచినా ప్రస్తుతం పాత వాళ్లదే రాజ్యం కావడంతో గ్రేటర్ లో బడ్జెట్ కానుక పేరుతో కొత్త స్కామ్ కి తెర తీశారు.

షెడ్యూల్ కంటే ముందే జిహెచ్ఎంసి ఎన్నికలు జరిగాయి.. కొత్త వాళ్ళు గెలిచారు.. కానీ ఇంకా పాత వాళ్లదే పాలన.. అయితే తాజాగా జిహెచ్ఎంసి బడ్జెట్ ఆమోదం కోసం స్టాండింగ్ కమిటీ భేటీ అయింది. 2020-21 సంవత్సరానికి 5 వేల 600 కోట్ల రూపాయలకు బడ్జెట్ ఆమోదించారు.. అయితే ఆమోదించిన వాళ్ళు ఊరికే ఊరుకోరు కదా.. బడ్జెట్ ఆమోదించినందుకు గానూ చివరి సారిగా ఓ కోరిక బయట పెట్టింది స్టాండింగ్ కమిటీ.

కమిటీ మెంబర్లకు తలా ఒక ఐ ఫోన్ ప్రో 12 లేటెస్ట్ మోడల్ కావాలని కోరారు.. దాంతో హడావుడిగా అధికారులు సైతం టెండర్లకు పిలిచారు.. ఒక్కో ఐ ఫోన్ కు లక్షా 30 వేల ఖర్చవుతుంది..అలా మొత్తం ఫోన్లకు 32 లక్షల దాకా ఖర్చు కానుంది.. అయితే మార్కెట్లో 20ఫోన్లు లేవని టెండర్లు ఒకే కాలేదు….

స్టాండింగ్ కమిటీలోని 7గురు కార్పోరేటర్లు మొన్నటి ఎన్నికల్లో ఒడిన వారే. ఐఫోన్ 12ప్రో 512GB సామర్థ్యం కలిగిన 17 ఫోన్ లను కొనుగోలు చేయాలని స్టాండింగ్ కమిటీ ప్రతిపాదనల్లో పంపించారు అధికారులు..అయితే మార్కెట్లో స్టాక్ లేకపోవడంతో కొనుగోళ్లను వాయిదా వేసింది జిహెచ్ఎంసి. మరో నెలా 15 రోజుల్లో పాలకమండలి గడువు ముగుస్తున్న తరుణంలో ఐఫోన్ల కోసం స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా.. కొందరు కార్పొరేటర్ల తీరు మారలేదు. పలువురు సభ్యులు ఐ-ఫోన్‌ల కోసం పట్టుపట్టినట్టు తెలిసింది. ఆమోదం అనంతరం… వీలైనంత త్వరగా ఫోన్లు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. విషయం తెలిసిన ప్రభుత్వం బడ్జెట్‌ కానుక బంద్‌ చేయాలని ఆదేశించినట్టు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news