ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు.. టీడీపీ నేతలు అరెస్ట్

-

నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన ధాన్యం కొనుగోళ్ల అక్రమాలు స్థానికంగా, రాజకీయంగాను వివాదాస్పదమవుతోంది. జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు రూరల్ డీఎస్పీ హరినాథ్ రెడ్డి వెల్లడించారు. మిల్లర్లు, దళారులు కుమ్మకై ఈ అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. రైతుల వద్ద తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి, వాటినే మద్దతు ధరలకు విక్రయించినట్లు వివరించారు. ఈ కేసులో ఏడుగురి పై పోలీసులు కేసు నమోదు చేసిన్నట్లు పేర్కొన్నారు. కేసు విచారణలో ఉందని, త్వరలో మరన్నీ వివరాలు సేకరిస్తామని పోలీసులు తెలిపారు.

tdp
tdp

డీఎస్పీ హరినాథ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. టీడీపీ నేతలు వెంకటాచలం మండలం అనికేపల్లి గ్రామానికి చెందిన జి. జయపాల్, మనుబోలు మండలం లక్ష్మీనరసాపురం గ్రామానికి చెందిన కరియావుల మధుసూదన్‌రావు కీలక పాత్రదారులు. అయితే తక్కవ ధరకే ధాన్యం కొనుగోలు చేసిన వీరు ఆ పంటను తామే పండించామని చెప్పి ప్రభుత్వానికి అధిక ధరకు విక్రయించారు. అక్రమాన్ని గుర్తించిన డీఆర్‌డీఏ ఇందుకూరుపేట ఏరియా కో-ఆర్డినేటర్‌ కనుపూరు శ్రీనివాసులు ఈ నెల 3న వెంకటాచలం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు టీడీపీ నేత కరియావుల మధుసూదన్‌రావు, గుంటూరు జిల్లా కర్లపాలెంకు చెందిన శ్రీలక్ష్మి వెంకటసాయి మణికంఠ రైస్‌మిల్లు యజమాని బి. శ్రీనివాసరావు, కోవూరు మండలం ఇనుమడుగు గ్రామానికి చెందిన పి.మల్లికార్జునరెడ్డి, వెంకటాచలం మండలం ఈదగాలికి చెందిన ఉప్పు పద్మనాభం, వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన మస్తాన్, కిశోర్‌లను అరెస్ట్‌ చేశారు. కాగా వీరిలో తెలుగుదేశం పార్టీ నేత జైపాల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆ ఆరుగురిని పోలీసులు విచారణ జరిపారు. అనంతరం డీఎస్పీ హరినాథ్ మాట్లాడుతూ.. ఈ అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని, బాధ్యులందరి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news