వారిని నిర్ల‌క్ష్యం చేస్తే వైసీపీకి న‌ష్ట‌మేనా..

ఏ పార్టీ ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా వెల్లిన‌ప్పుడే దానికి ప‌ది కాలాల పాలు మ‌నుగ‌డ ఉంటుంది. ఎంత పెద్ద నాయ‌కులు ఉన్నా స‌రే క్షేత్ర స్థాయిలో పార్టీన‌ని న‌డిపించే వారు కార్య‌క‌ర్త‌లు. అలాంటి వారికి అనుసంధానంగా ఉండేవారు సెకండ్ గ్రేడ్ నాయ‌కులు. వీరు లేక‌పోతే ఏ పార్టీ అయినా స‌రే అధికారంలోకి రాలేద‌నేది వాస్త‌వం. మ‌రి ప్ర‌తి పార్టీకి కూడా సెకండ్ గ్రేడ్ నాయ‌కులు అంత అవ‌స‌రం. ఒక పార్టీ త‌ర‌ఫున ప్ర‌జ‌ల‌కు అత్యంత ద‌గ్గ‌రగా ఉండే ఏజెంట్ లాంటివారు ఈ సెకండ్ గ్రేడ్ నాయ‌కులు మ‌రి. కాబ‌ట్టి వీరి విష‌యంలో అగ్ర నేత‌లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.

Jagan
Jagan

లేక‌పోతే మాత్రం ఫ‌లితాలు మ‌తారుమారు అయిపోతాయ‌ని చ‌రిత్ర చెబుతోంది. ఇప్పుడు వైసీపీలో వీరు కొంత అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ విష‌యంలో వీరు ఎంతో ముఖ్యంగా ప‌నిచేస్తున్నా కూడా స‌రైన గుర్తింపు లేక ఇబ్బంది ప‌డుతున్నారంట‌. అందుకే ఇప్పుడు వీరంతా సీఎం జ‌గ‌న్ ఒక్క‌సారైనా త‌మ‌తో నేరుగా ఒక ముఖాముఖి కార్య‌క్ర‌మంలో పాల్గొనాల‌ని డిమాండ్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

చాలా జిల్లాల్లో వైసీపీకి వీరు ప‌ట్టు కొమ్మ‌లుగా ఉన్నా కూడా స‌రైన గుర్తింపు లేదంటే ప‌ద‌వులు లేక చాలా నిరాశ‌గా ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ ఇంత‌టి ఘనవిజయం పొంద‌డంలో వీరే అత్యంత కీల‌కంగా ప‌నిచేశారు. మ‌రి ఈ ద్వితీయశ్రేణి నాయ‌కుల‌ను ఇప్పుడు గ‌న‌క ప‌క్క‌న పెడితే ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు స‌మాచారం వెళ్లే ప్ర‌మాదం ఉంటుంది. కాబ‌ట్టి వీరంతా సీఎం జ‌గ‌న్‌తో త‌మనే నేరుగా ఒక స‌మావేశం నిర్వ‌హిస్తేనే వాస్త‌వ ప‌రిస్థితులు తెలుస్తాయ‌ని అంటున్నారు. కాగా వీరిని జ‌గ‌న్ గ‌న‌క అవ‌కాశం ఇస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి.