ఆ మాజీ తమ్ముడుకు కేసీఆర్ సీటు ఇవ్వడం లేదా?

-

తెలంగాణ అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో మాజీ తమ్ముళ్ళు…అంటే టి‌డి‌పి నుంచి వచ్చిన నేతలు ఎంతమంది ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. సగానికి సగం మంది టి‌డి‌పి నేతలు, కార్యకర్తలే బి‌ఆర్‌ఎస్ లో ఉన్నారు. ఆఖరికి సి‌ఎం కే‌సి‌ఆర్ సైతం ఆ టి‌డి‌పి లో పనిచేసి వచ్చిన వారే. సరే ఆ విషయం పక్కన పెడితే. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో పనితీరు సరిగ్గా లేని ఓ 20 మంది ఎమ్మెల్యేల వరకు కే‌సి‌ఆర్ సీటు ఇచ్చే అవకాశాలు లేవని తెలుస్తుంది. తెలంగాణలో 119 ఎమ్మెల్యేలు ఉంటే అందులో 103 బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే. ఇక అందరికీ సీట్లు ఇస్తే బి‌ఆర్‌ఎస్ పార్టీకే రిస్క్. చాలామందిపై ప్రజా వ్యతిరేకత ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో పనితీరు బాగోని, ప్రజా వ్యతిరేకత ఎమ్మెల్యేలని పక్కన పెట్టడం ఖాయమని చర్చ సాగుతుంది. ఈ క్రమంలోనే టి‌డి‌పి నుంచి బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీటు విషయం డౌటే అని ప్రచారం వస్తుంది.

2009, 2014 ఎన్నికల్లో ప్రకాష్ గౌడ్ టి‌డి‌పి నుంచి గెలిచారు. తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. ఇదే క్రమంలో 2018 ఎన్నికల్లో పోటీ చేసి టి‌డి‌పి‌పై 58 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.అయితే వరుసగా గెలుస్తూ వస్తున్న ప్రకాష్ పై వ్యతిరేకత కాస్త ఎక్కువగా ఉందని కథనాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే బంధువులు భూ దందాలు, కబ్జాలు పెరిగాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యే అల్లుడుపైనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.

ఈ పరిణామాలు ప్రకాష్‌కు మైనస్..ఇదే సమయంలో చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి..రాజేంద్రనగర్ సీటు కోసం ట్రై చేస్తున్నారు. అటు ఎం‌ఐ‌ఎం ఈ సీటు గెలవాలని చూస్తుంది. దీంతో ఈ సీటు విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. కే‌సి‌ఆర్ సీటు ఎవరికి ఇస్తారనేది సస్పెన్స్ గా మారింది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఉండదనే ప్రచారం వస్తుంది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version