ప్రపంచంలో అత్యధిక వయసున్న వ్యక్తి హఠాన్మరణం !

-

కొన్ని కొన్ని ఘటనలు రికార్డులుగా నమోదు అవుతుంటే, మరికొన్ని ఘటనలు మాత్రమే చాలా బాధను కలిగిస్తూ ఉంటాయి. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యధిక వయసుతో జీవించి ఉన్న వ్యక్తిగా బ్రెజిల్ దేశానికి చెందిన జొస్ పౌలీనో గోమ్స్ రికార్డ్ సృష్టించారు. కానీ న్యూయార్క్ పత్రిక చెబుతున్న సమాచారం ప్రకారం ఈయన 127 సంవత్సరాల వయసు ఉండగా మరణించారట. అయితే ఇక్కడ విషాదమైన వార్త ఏమిటంటే మరొక్క వారం రోజులలో గోమ్స్ పుట్టిన రోజు ఉందట. కానీ ఈ లోపు ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు చాలా బాధపడినట్లు తెలుస్తోంది. గోమ్స్ బ్రెజిల్ లోని మైనస్ గెరయిస్ పెడ్రా బోనిటా లోని స్వంత ఇంటిలో మరించారు. కాగా మిస్టర్ గోమ్స్ వివాహ సర్టిఫికెట్ ప్రకారం ఈయన ఆగష్టు 4, 1895 న జన్మించారని తెలుస్తోంది. మరి ఇతని మరణించడంతో ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరు అత్యధిక వయసు ఉన్నవారో తెలియాల్సి ఉంది.

ఇక ఇతని పేరు గిన్నీస్ బొక్క అఫ్ రికార్డ్స్ లోనూ తొలగించే అవకాశం ఉంది. కానీ ఈ వార్త అధికారికంగా తెలియచేయాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version