ఆ ఒక్క కారణంతోనే క్యాబినెట్ విస్తరణ ఆలస్యం అవుతోందా..? మరికొద్ది రోజులు నిరీక్షణ తప్పదా..

-

ఈ నెలాఖరు లోపు క్యాబినెట్ విస్తరణ చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ పట్టుదలతో ఉంది.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. మంత్రివర్గవిస్తరణ చేపట్టకపోవడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు.. దీంతో దీనిపై రాష్ట నాయకత్వం లిస్ట్ కూడా పంపింది.. కానీ ఓ బలమైన కారణంతో విస్తరణకు తాత్కాలిక బ్రేక్ పడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి..

తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం సీఎంతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. క్యాబినేట్‌లోకి ఇంకా ఆరుగురిని తీసుకునే అవకాశం ఉంది. ఈ ఆరుగురి ఎంపిక విషయంలో రాష్ట్ర ముఖ్యనేతలు అధిష్టానంతో చర్చలు జరిపారు.. సామాజికవర్గాల సమీకరణాలను పరిగణలోకి తీసుకుని.. క్యాబినెట్ కూర్పు చెయ్యాలని భావించారు.. ఈ క్రమంలోనే లిస్ట్ ను కూడా సిద్దం చేసి ఆమోదముద్ర కోసం ఢిల్లీకి పంపారు.. కానీ ఇక్కడే బ్రేక్ పడినట్లు పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది..

తెలంగాణాలో పార్టీ అధికారంలోకి రావడం కోసం పార్టీలోని పెద్దలు కొందరికి కమిట్మెంట్స్ ఇచ్చారు.. సీటుకు గెలిపించుకు వస్తే మంత్రిపదవి ఇస్తామని, కీలక పదవులు ఇస్తామని చెప్పుకొచ్చారు.. ఇదే క్యాబినెట్ విస్తరణకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది..పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ ను గెలిపిస్తే.. మంత్రివర్గంలో అవకాశం ఇస్తామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం హామీ ఇచ్చిందట.. ఇప్పుడు ఈ హామీని నిలబెట్టుకోవాలని రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారని టాక్ వినిపిస్తోంది.

మంత్రివర్గంలోకి రాజగోపాల్ రెడ్డిని తీసుకోవడానికి కొన్ని అడ్డంకులను తెరమీదకు తీసుకొస్తున్నారు పార్టీ పెద్దలు.. ఇప్పటికే నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రివర్గంలో ఉన్నారు. ఇద్దరూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారే.. ఈ క్రమంలో మరో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతకు అవకాశం ఇస్తే.. ఇబ్బందులు వస్తాయని అధిష్టానం ఆలోచనలో పడిందట.. దానికితోడు ఒకే ప్యామిలీలో ఇద్దరిని క్యాబినెట్ లోకి తీసుకుంటే.. మిగిలిన సామాజికవర్గ నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తారన్న భావనలో అధిష్టానం ఉందట.. ఈ ఒక్క కారణంతోనే క్యాబినెట్ విస్తరణ బ్రేక్ పడిందని పార్టీలో చర్చ నడుస్తోంది.. ఈ సమస్యలన్నీ పరిష్కారమై.. ఎప్పుడు విస్తరణ జరుగుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version