ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి తీవ్ర స్థాయిలో జరుగుతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఒకపక్క కరోనా వైరస్ తో జనాలు నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. కరోనా టెస్ట్ కిట్స్ నుంచి మొదలైన రాజకీయం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళింది.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి దారుణంగా విమర్శలు చేసుకుంటున్నారు. టెస్ట్ కిట్ ధరల విషయంలో కన్నా మాట్లాడగా దానిపై విజయసాయి రెడ్డి చంద్రబాబు కోవర్ట్ అన్నారు. ఆ తర్వాత 20 కోట్లకు కన్నాను కొనుక్కున్నారు అంటూ సుజనా డీల్ కుదిర్చారు అని మాట్లాడారు. అక్కడి నుంచి ఈ సీన్ లో సుజనా ఎంటర్ అయి…
ఎవరిని అన్నారో గాని కుక్కలు మొరుగుతున్నాయని అన్నారు. ఇలా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో చేసుకుంటున్న విమర్శలు అసలు కరోనా విషయాన్ని పక్కదారి పట్టించింది. రాజకీయంగా బిజెపి బలంగా లేదు. అయినా సరే చంద్రబాబుకి రాష్ట్రంలో సహకారం అందిస్తుంది అనేది వైసీపీ భావన. అందుకే విజయసాయి పదే పదే విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇక రాష్ట్ర బిజెపి కూడా దీనిపై ఘాటుగానే స్పందించింది.
విజయసాయి ని జైలు పక్షి అక్కు పక్షి అంటూ వ్యాఖ్యలు చేసింది. అయితే మీడియా ను డైవర్ట్ చేసే ఉద్దేశం తోనే విజయసాయి ఈ విమర్శలు చేస్తున్నారు అనేది అర్ధమవుతుంది అని టీడీపీ నేతలు అంటున్నారు. కిట్స్ విషయంలో విజయసాయి ఒక రోజు రెండు మాటలు మాట్లాడారు. చత్తీస్గఢ్ మంత్రి ట్వీట్ తో అది బయటపడే సరికి ఆయన మాట మార్చి విమర్శలు చేసి మీడియా ను డైవర్ట్ చేసారని అంటున్నారు.