మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ శుక్రవారం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు లేఖ రాశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ పై లేఖ రాశారు. తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని కేటీఆర్, కవిత తరపు సన్నిహితులు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని.. ఆధారాలు ఇస్తే 100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశ పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు.
అయితే ఈ లేఖపై తాజాగా స్పందించారు మంత్రి కేటీఆర్. నేరస్తుడు, మోసగాడు సుఖేష్ తనపై చేసిన మతిలేని ఆరోపణలు మీడియా ద్వారా తన దృష్టికి వచ్చాయన్నారు. సుఖేష్ అనే వాడి గురించి తానెప్పుడూ వినలేదని.. వాడెవడో కూడా తనకు తెలియదన్నారు. సుఖేష్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా గట్టి చర్యలు తీసుకుంటానన్నారు. సుకేష్ లాంటి నేరస్తుడు, మోసగాడు చేసిన అడ్డగోలు వ్యాఖ్యలను మీడియాలో ప్రసారం చేసే ముందు లేదా ప్రచురించే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని మీడియాకి విజ్ఞప్తి చేశారు కేటీఆర్.