అప్పుడే అయిపోలేదు.. ఇప్పుడే మొద‌లైంది – కేసీఆర్

ప్ర‌స్తుతం రాష్ట్ర బీజేపీ కి కేంద్రం లో ఉన్న బీజేపీ కి ముఖ్య మంత్రి కేసీఆర్ వ‌రుస ప్రెస్ మీట్ ల‌తో కౌంట‌ర్ ఇస్తున్నారు. ఈ రోజు కూడా ముఖ్య మంత్రి త‌న రెండో ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రెస్ మీట్ అయిపోతున్న స‌మ‌యంలో విలేక‌ర్లు ప్ర‌శ్న‌లు అడిగితే.. ఎందుకు తొంద‌ర‌.. ఇప్పుడే ఎం అయి పోలేదు. కథ మొత్తం ఇప్పుడే మొద‌లైంద‌ని ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు.

అలాగే ఎందుకు తొంద‌ర రేపు కూడా మాట్లాడుకుందా.. రేపు మీడియా వాళ్ల‌కు భోజ‌నాలు కూడా ఏర్పాటు చేస్తామ‌ని ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. అంతే కాకుండా ఈ విష‌యం పై ఎదో ఒక‌టి తేలే వ‌ర‌కు పోరాటం ఆగ‌దు అని విలేక‌ర్ల‌తో అన్నాడు. దీని బ‌ట్టి ప్ర‌తి రోజు ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే బీజేపీ తో తాడో పేడో చూసు కోవ‌డానికి ముఖ్య మంత్రి కేసీఆర్ సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తుంది. అందుకే ప్ర‌తి రోజు ప్రెస్ మీట్ పెట్టాల‌ని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే మీడియా విలేక‌ర్ల‌తో ముఖ్య మంత్రి కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేసిన‌ట్టు తెలుస్తుంది.