ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పలు పట్టణలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతన్న విషయం తెలిసింది. దీని పై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు స్పందించాడు. ఈ ఎన్నికలలో అక్రమాలు జరుగుతన్నాయని చంద్రబాబు చాలా రోజుల నుంచి ఆరోపిస్తున్నారు. దీని పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీతో ఫోన్ ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడారు.
నెల్లూరు, కుప్పం, దర్శి స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఎస్ఈసీ నీలం సాహ్నీ చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బాధ్యత తీసుకోవాలని ఎస్ఈసీ నీలం సాహ్నీ ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరాడు. సకాలంలో అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించకుండా.. ఫోర్జరీ సంతకాలతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిస్తున్నారని నీలం సాహ్నీకి చంద్ర బాబు ఫిర్యాదు చేశారు. అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించని చోట తక్షణమే ఎన్నికల ప్రక్రియ నిలిపి వేయాలని చంద్రబాబు కోరాడు. అలాగే అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నీలం సాహ్నీ ని కోరాడు.