బాబు-చినబాబుకు జగన్ బ్రేకులు..సాధ్యమేనా?

-

ఏదేమైనా ఈ సారి కుప్పం నియోజకవర్గాన్ని గెలవాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు..కుప్పంతో కలిపి 175 నియోజకవర్గాలు గెలవాలని…తమ పార్టీ వాళ్ళకు పదే పదే చెబుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గానే జగన్ రాజకీయం నడిపిస్తున్న విషయం తెలిసిందే…మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరక్షన్ లో..కుప్పంలో బాబు బలం తగ్గించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

పైగా అధికారంలో ఉండటంతో…అధికార బలాన్ని అంతా ఉపయోగించి..కుప్పంలో వైసీపీ బలపడుతూ వచ్చింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పంలో పంచాయితీలని గెలుచుకుంది..అలాగే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సిలు గెలుచుకుంది…ఇక టీడీపీకి పట్టున్న కుప్పం మున్సిపాలిటీని సైతం వైసీపీ కైవసం చేసుకుంది. ఇలా సత్తా చాటిన నేపథ్యంలో…నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం ఎందుకు గెలుచుకోలేమని జగన్ అంటున్నారు. ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరాలని చూస్తున్నారు. అదే సమయంలో బాబుని కుప్పంకు మాత్రమే పరిమితం చేసి..రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని జగన్ చూస్తున్నారు. ఇప్పటికే బాబుని పదే పదే కుప్పం వెళ్ళేలా చేశారు. అసలు ఎన్నికల సమయంలో బాబు కుప్పం ప్రచారానికి కూడా వెళ్లరు..అలాంటిది ఇప్పుడు కుప్పంలోనే బాబు ఇల్లు కట్టుకునేలా చేశారు. అయితే ఇలా కుప్పంప బాబు ఫోకస్ పెరిగింది..ఈ ఫోకస్ ఎన్నికల వరకు ఉంచి…బాబుని రాష్ట్రమంతా తిరగనివ్వకుండా చేయాలనేది జగన్ కాన్సెప్ట్.

అదే సమయంలో మంగళగిరిలో బలపడుతున్న లోకేష్ ని సైతం…ఆ నియోజకవర్గానికే కట్టడి చేసేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది..ఈ సారి ఆయన గెలుపు కష్టమని ప్రచారం జరుగుతుంది…ఈ క్రమంలో చినబాబు బలం పెరుగుతుంది. ఇక చినబాబుకు గెలుపుపై ధీమా పెరిగితే…ఆయన కూడా రాష్ట్రంలో టీడీపీని గెలిపించడం కోసం తిరుగుతారు.

అందుకే చినబాబుని సైతం మంగళగిరి వరకే కట్టడి చేసేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు..ఇప్పటికే నియోజకవర్గంపై పట్టు ఉన్న మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావుని వైసీపీలోకి లాగారు. తాజాగా గంజి చిరంజీవి సైతం టీడీపీని వీడారు. ఇలా నిదానంగా టీడీపీ బలం తగ్గించి…చినబాబు మంగళగిరిపైనే ఫోకస్ పెట్టేలా చేయాలని చూస్తున్నారు. అయితే ఇలా కట్టడి చేయడం ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version