మరోసారి వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి విమర్శనాస్త్రాలు

-

ఏపీలో టీడీపీ నేతలకు వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇంపాక్ట్‌ ఫీజు అంటూ ఓ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో.. టీడీపీ నేత పట్టాభి వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. జనాలను వైసీపీ ప్రభుత్వం విపరీతంగా బాదేస్తోందని అన్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పేరుతో రూ. 20 వేల కోట్లు బాదారని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో ఒకవైపు బటన్ నొక్కుతున్న జగన్… మరోవైపు చార్జీల పేరుతో వెనక్కి లాగేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని విద్యుత్ డిస్కమ్ లను జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని… అన్ని డిస్కమ్ లు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని చెప్పారు.

ఏపీ డిస్కమ్ లు రూ. 38,836 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని అన్నారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసిందని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఇంపాక్ట్‌ ఫీజు ద్వారా.. రోడ్డు ప్రక్కన భవనం నిర్మాణం చేస్తే.. అడుగుకు రూ.100 చొప్పున చెల్లించాలి. సుమారు 500 గజాల ఇళ్లు నిర్మాణం చేయాలంటే.. దాదాపు రూ.2లక్షల ఇంపాక్ట్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఈ ఇంపాక్ట్‌ ఫీజు ద్వారా వచ్చిన డబ్బులను రోడ్ల నిర్మాణాలకు వినియోగిస్తామని తెలిపింది ఏపీ సర్కార్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version