ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ భారీ విజయం సాధించడం వెనుక ప్రశాంత్ కిషోర్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దేశంలోనే టాప్ ఎన్నికల వ్యూహకర్త గా ప్రశాంత్ కిషోర్ పేరు సాధించగా అతనికి మరో అరుదైన గౌరవం కూడా దక్కింది.
ప్రతిష్టాత్మకంగా పేర్కొనే ఫోర్బ్స్ టాప్ 20 జాబితాలో అతను పేరు సంపాదించారు. అంతేకాకుండా ఫోర్బ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో ప్రశాంత్ కిషోర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ దశాబ్దపు భారత దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ కీలక వ్యక్తి అని చెప్పింది.
అయితే అలా అతని పేరు విడుదల అయిందో లేదో జగన్ నుండి ఇలా అతనికి ఫోన్ వెళ్లిపోయిందట. ముందు అతనికి అభినందనలు తెలిపిన జగన్ తర్వాత కొన్ని విషయాలలో లో-ప్రొఫైల్ మెయింటెన్ చేయమని సలహాలు సూచనలు ఇచ్చినట్లు పార్టీ వర్గాలు దగ్గర్నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.
అంత ఎక్కువ డబ్బులు ఉంటే వచ్చే కీడును గురించి జగన్ కన్నా బాగా ఇంకెవరికీ తెలియదు. ఆ రైడ్ లు ఈ చెకింగ్ లు అని ఊరికే అధికారులు చావ కొడతారని…. జగన్ అతన్ని అప్రమత్తంగా ఉండమని సలహా ఇచ్చారట. ఎంతైనా జగన్ గంతకు తగ్గ బొంత అన్నట్టు మంచి పార్టీ నే పట్టాడు.