అవును పవన్ వేసే వ్యూహాలతో జగన్ మళ్ళీ సీఎం అవ్వడం ఖాయమని చర్చలు నడుస్తున్నాయి. అదేంటి పవన్ ఏమో వైసీపీని ఓడించడానికి పొత్తులకు రెడీ అవుతున్నారు..వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వకుండా చూసుకోవాలని ఆయన చూస్తున్నారు. అలాంటప్పుడు ఆయన వ్యూహం కరెక్ట్ కదా అని అనుకోవచ్చు. కానీ ఆ వ్యూహమే పెద్ద తప్పు అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
విశ్లేషకులే కాదు..తాజాగా సిపిఐ నారాయణ కూడా పవన్ వ్యూహాలపై విమర్శలు చేశారు. పవన్ కోరుతున్నట్లుగా బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే చివరకు వైసీపీకే లాభం చేకూరుతుందని, బీజేపీ వ్యతిరేక ఓటు వైసీపీకి పడుతుందని, మళ్లీ వైఎస్ జగనే విజయం సాధించే ఛాన్స్ ఉందని అంటున్నారు. టీడీపీ, జనసేన వెళ్లి బీజేపీతో కలిస్తే వైసీపీకి లాభం జరుగుతుందని, ఈ కూటమి వచ్చినా రాష్ట్రంలో ఎటువంటి లాభం లేదని చెప్పుకొచ్చారు.
అయితే నారాయణ చేసే కామెంట్లలో లాజిక్ ఉందని, టిడిపి-జనసేన కలిస్తే పర్లేదు అని, కానీ బిజేపితో కలితే దెబ్బతినడం తప్పదని అంటున్నారు. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉంటూ బిజేపి రాష్ట్రానికి న్యాయం చేయలేదు. దీంతో ఏపీ ప్రజలు బిజేపిపై ఎక్కువ కోపం తో ఉన్నారు. ఇక పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్న టిడిపి శ్రేణుల్లో సైతం బిజేపిపై కోపం ఉంది. వారే బిజేపితో పొత్తు వద్దు అంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం రాజకీయ అవసరాల కోసం బిజేపితో కలిసి ముందుకెళ్లాలని చూస్తున్నారు.
కానీ అలా చేస్తే బిజేపిపై ఉన్న వ్యతిరేకత టిడిపి, జనసేనలపై పడుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా వైసీపీకి లాభం జరుగుతుందనే అంచనా వేస్తున్నారు. చూడాలి మరి పొత్తు ఫిక్స్ అవుతుందో లేదో.