ఆయన్ను మీరు అన్న అంటారా? దున్న అంటారా?

-

బీసీలకు చంద్రబాబు 2014 లో 119 హామీలు ఇచ్చాడు. ఎన్నికల ముందు బీసీ డిక్లరేషన్ మాత్రం ఇస్తాడు… తర్వాత కడుపు మాడ్చుతాడు. చివరకు ఎన్నికల ముందు.. ఇవన్నీ పెడతామంటాడు. మరి.. అటువంటి వ్యక్తిని మీరు అన్న అంటారా? లేక దున్న అంటారా? అని వైఎస్ జగన్.. చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అనంతరపురంలో జరిగిన సమరసంఖారావంలో జగన్ మాట్లాడారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ పాలనను జగన్ మూడు సినిమాలతో పోల్చారు.

మొదటి సినిమా

2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు చూస్తే… కేజీ నుంచి పీజీ వరకు పిల్లలకు ఉచిత విద్య, రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ, ధరల స్థిరీకరణ, పేదలకు ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, నెలకు 2 వేల నిరుద్యోగ భృతి, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు, ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ… ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి కానీ.. వాటిలో ఒక్కటంటే ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయలేదు. ఏపీని మాత్రం అమాంతం దోచేశాడు.

రెండో సినిమా

నాలుగేళ్ల పాటు బీజేపీతో సంసారం చేశాడు. పవన్ కళ్యాణ్ తో సంసారం చేశాడు. ఇప్పుడు సంసారం చేసిన వాళ్లతోనే పోరాటం చేస్తున్నాడు. అప్పుడు వాళ్లు మంచోళ్లు.. ఇప్పుడు చెడ్డోళ్లు.. ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా? అంటూ ప్రత్యేక హోదా అన్నోళ్లపై కేసులు పెట్టారు కదా. మోదీని పొగుడుతూ 2017 జనవరిలో ఏపీకి చేసినట్టు ఏ రాష్ట్రానికైనా చేశాడా? అంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరినప్పుడు ఏమైంది. ఎన్నికలు దగ్గరికి రాగానే బీజేపీతో చేసిన సంసారం పక్కన బెట్టి… విడాకులు తీసుకొని ఇప్పుడు ఢిల్లీకి పోయి దీక్ష చేయడం దేనికి నిదర్శనం.

మూడో సినిమా

ఇది బడ్జెట్ సినిమా. ఇందులో అన్నీ జగన్ పథకాలే. వాటినే కాపీ కొట్టి… ఇంకో మూడు నెలలు ఆగండి. మళ్లీ వచ్చే ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ వస్తాయి.. అవి మన జీవితాలను మారుస్తాయి.. అంటూ జగన్… చంద్రబాబుపై ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version