చంద్రబాబు ఓటమి ఖాయం.. అమిత్ షా

-

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోతాడు. ఘోరంగా ఓడిపోవడం తప్పించి చంద్రబాబుకు మరో ఆప్షనే లేదు అంటూ అమిత్ షా విమర్శించారు. ఆయన ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రధానిని పట్టుకొని ఇష్టమున్నట్టు తిట్టే వ్యక్తి చంద్రబాబు.. దేశ ప్రధాని తన రాష్ట్రానికి వస్తే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవించాలనే విత లేని వ్యక్తి చంద్రబాబు అంటూ అమిత్ షా ఫైర్ అయ్యారు. ఏపీకి అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ పంచన చేరి బాబు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని అమిత్ షా తెలిపారు.

ప్రత్యేక హోదా సంజీవని కాదని చెప్పింది ఎవరు.. ఇదే చంద్రబాబు కాదా అని అమిత్ షా ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అడిగిన వారిని అరెస్ట్ చేయించిన ఘనత చంద్రబాబుదని ఆరోపించారు. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని ఇదే చంద్రబాబు ఇదివరకు అన్నాడు.. ఇప్పుడు హోదా అంటూ దొంగ దీక్షలు చేస్తున్నాడు. ఊసరవెల్లి కూడా సిగ్గు పడేలా రంగులు మారుస్తున్న చంద్రబాబును ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడించాలంటూ అమిత్ షా తన లేఖలో పేర్కొన్నారు.

ఏపీ ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వక పోవడం వల్లనే కడపలో స్టీల్ ఫ్యాక్టరీపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రాకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదు.. చంద్రబాబే.. ముమ్మాటికీ చంద్రబాబే.. అంటూ అమిత్ షా అన్నారు. విభజన చట్టంలోని ఎన్నో వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. కానీ.. వాటిపై మాత్రం చంద్రబాబు ఒక్కమాట మాట్లాడటం లేదంటూ అమిత్ షా.. చంద్రబాబు ఫైరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version