రాష్ట్ర విభజన జరగక ముందు వరకు నెల్లూరు మరియు చిత్తూరు రాజకీయాల్లో రాజకీయంగా పనబాక కుటుంబానికి తిరుగులేదు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా రాణించారు పనబాక దంపతులైన పనబాక కృష్ణయ్య, పనబాక లక్ష్మి. పనబాక లక్ష్మి… వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో నెల్లూరు రిజర్వుడ్ నుండి పార్లమెంటు స్థానానికి పోటీ చేసి గెలవడం జరిగింది. ఆ తరువాత కేంద్ర మంత్రిగా కూడా యూపీఏ హయాంలో చక్రం తిప్పారు.
ఇదే తరుణంలో అంతా ఓకే అయితే టీడీపీకి బాయ్ చెప్పాలని పనబాక కుటుంబం కూడా రెడీ అయినా క్రమంలో జగన్ మండలి రద్దు చేయడంతో…అంతలోనే ఈ కుటుంబానికి ట్విస్ట్ ఇచ్చినట్లయింది అని తాజాగా పార్టీలో టాక్ వినబడుతోంది. విషయంలోకి వెళితే శాసన మండలి రద్దు తో ఇద్దరు మంత్రుల లో ఒకరిని రాజ్యసభకు పంపించే ఆలోచన జగన్ తీసుకోవటంతో పనబాక కుటుంబానికి షాక్ ఇచ్చినట్లు అయిందని వైసీపీ పార్టీలో వార్తలు వస్తున్నాయి.