జగన్‌పై దాడి గురించి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. జగన్ పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్నారని పేర్కొన్నారు. ‘వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం ‘జగన్ మోదీ రెడ్డి’కి కొత్త కాదు. మరోసారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామాకి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది. ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు. తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చర్యం లేదు. ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే’ అంటూ #Jagannatakam అనే హ్యాష్‌ట్యాగ్‌ను లోకేశ్ ట్వీట్ చేశారు.
వైకాపా కోడి కత్తి డ్రామా! అధికారం కోసం అడ్డదారులు తొక్కడం జగన్ మోడీ రెడ్డి కి కొత్త కాదు. మరో సారి ఓటమి తప్పదు అనే భయంతో కోడి కత్తి డ్రామా కి తెరలేపారు. దాడి వెనుక ఉన్న వైకాపా కుట్ర ప్రజలకు అర్థం అయ్యింది.ఇంకా ప్రజలను మభ్య పెట్టాలి అని వైకాపా నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారు.
— Lokesh Nara (@naralokesh) October 26, 2018
తండ్రి చితికి నిప్పు పెట్టకముందే ముఖ్యమంత్రి పీఠం పై కన్నేసిన వ్యక్తి ఇలాంటి కత్తి డ్రామా చెయ్యడంలో ఆశ్చరం లేదు.ఎన్ని కుయుక్తులు పన్నినా ఆఖరిగా ప్రజల ముందు గెలిచేది నిజం మాత్రమే. #Jagannatakam
— Lokesh Nara (@naralokesh) October 26, 2018
ఇటు ఫిన్ టెక్ కార్యక్రమాన్ని భగ్నం చేయడం, అటు ప్రజల సానుభూతిని పొందడం – ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనుకున్నాడు జగన్. కానీ ఏ ప్రతిష్టాత్మక కార్యక్రమం జరుగుతున్నా అదే సమయంలో ఏదో ఒక అలజడి సృష్టించడం వరుసగా చూస్తూ వస్తున్నదే కాబట్టి జగన్ నాటకానికి ఏ ప్రయోజనమూ దక్కలేదు. #Jagannatakam
— Lokesh Nara (@naralokesh) October 26, 2018
ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారణ చేస్తే కోడి కత్తి డ్రామా వెనుక నిజాలు బయటపడతాయి అని జగన్ మోడీ రెడ్డికి భయం పట్టుకుంది. కేంద్రం నిర్వీర్యం చేసిన మోడీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నాటకాన్ని రక్తి కట్టించి,టిడిపి పై నింద వెయ్యాలి అని జగన్ కలలు కంటున్నారు.
— Lokesh Nara (@naralokesh) October 26, 2018
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థలను, అధికారులను కించపరుస్తూ,బెదిరింపులకు పాల్పడుతున్న జగన్ మోడీ రెడ్డి కి ప్రజలే బుద్ధి చెబుతారు. #Jagannatakam
— Lokesh Nara (@naralokesh) October 26, 2018