తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా జగన్ చంద్రబాబుకు ఫోన్ చేసి కోరారు. అయితే బాబు అందుకు సమాధానం ఏమీ చెప్పలేదు. కానీ ఈ విషయంపై పార్టీ నేతలతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఈ నెల 30న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే. 30వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు. అయితే ఇప్పటికే జగన్ ఈ కార్యక్రమానికి ఇటు కేసీఆర్‌తోపాటు అటు ప్రధాని మోడీలను కూడా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని జగన్.. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా కోరారు.
తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా జగన్ చంద్రబాబుకు ఫోన్ చేసి కోరారు. అయితే బాబు అందుకు సమాధానం ఏమీ చెప్పలేదు. కానీ ఈ విషయంపై పార్టీ నేతలతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. అయితే మరో వైపు 2014లో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. అంతే కాదు.. వైకాపాకు చెందిన ఎవరూ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పట్లో హాజరు కాలేదు.
అయితే జగన్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేదు కనుక.. ఇప్పుడు చంద్రబాబు కూడా జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడం లేదని తెలిసింది. అప్పట్లో చంద్రబాబు తన ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా ఖర్చు చేశారని వైసీపీ ఆరోపించింది. వైకాపా నాయకులు టీడీపీని విమర్శించారు. ఈ క్రమంలో ఇప్పుడు జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు హాజరు అవుతారా, కారా.. అన్న విషయంపై అన్ని వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరి ఈ విషయంపై స్పష్టత రావాలంటే.. ఎల్లుండి వరకు వేచి చూడక తప్పదు..!