జగనన్న లెక్కలు..వంద సీట్లు..వచ్చేస్తాయా?

-

175కి 175 సీట్లు గెలవాలి..వచ్చే ఎన్నికల్లో జగన్ పెట్టుకున్న టార్గెట్ ఇది..గత ఎన్నికల్లో 151 సీట్లు ఇచ్చారు..ఇక అధికారంలోకి వచ్చి అన్నీ మంచి పనులే చేశాం..పథకాలకు డబ్బులు ఇచ్చాం…రాష్ట్రంలో నూటికి 90 శాతం పథకాలు అందినవారే దీంతో..వచ్చే ఎన్నికల్లో అందరూ తమకే మద్ధతు ఇస్తారని, అప్పుడు 175 సీట్లు గెలవడం అసాధ్యం కాదని జగన్ అంటున్నారు. సరే టార్గెట్ 175 సీట్లు అయిన..అవి గెలవడం అసాధ్యమనే సంగతి జగన్‌కు తెలుసు..కానీ ఓ టార్గెట్ పెట్టుకుంటే..దాన్ని రీచ్ అవ్వడానికి నేతలు బాగా కష్టపడతారని, అప్పుడు అధికారంలోకి కావల్సిన సీట్లు గెలిచిన చాలు అనే పరిస్తితి.

అయితే ఏపీలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు..ఆ సీట్లు వస్తే అధికారం ఖాయమే..ఇక 175 సీట్లు టార్గెట్ పెట్టుకుంటే కనీసం 100 సీట్లు అయిన వస్తాయనే లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కనీసం 100..అవి దాటితే 120 సీట్లు ఖాయమని వైసీపీ వర్గాలు అనుకుంటున్నాయి. ఇక వైసీపీ లెక్కల ప్రకారం..రాయలసీమ జిల్లాలో మెజారిటీ సీట్లు సాధించడం. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో కలిపి 52 సీట్లు ఉన్నాయి..గత ఎన్నికల్లో 49 సీట్లు సాధించారు. ఈ సారి 40 సీట్లు అయిన గెలవాలని చూస్తున్నారు.

ఇక ప్రకాశం-నెల్లూరు జిల్లాల్లో 22 సీట్లు ఉన్నాయి. ఈ జిల్లాల్లో 13-15 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. అటు కృష్ణా-గుంటూరు జిల్లాల్లో 33 సీట్లు ఉన్నాయి..కనీసం 15 సీట్లు అయిన గెలుచుకోవాలని చూస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 సీట్లు ఉన్నాయి..టి‌డి‌పి, జనసేన పొత్తు ఉంటే..వైసీపీకి 10 సీట్లే వచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఉత్తరాంధ్రలో 34 సీట్లు ఉంటే ఈ ప్రాంతంలో కూడా 20 సీట్లు టార్గెట్ గా పెట్టుకున్నారు. మొత్తం మీద వంద సీట్లు గెలుస్తామని వైసీపీ ధీమాగా ఉంది. చూడాలి మరి చివరికి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో.

Read more RELATED
Recommended to you

Exit mobile version