మూడు రాజధానుల అంశం మీద జగన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని జనసేన పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి వైసీపీ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ తీర్మానంతో మద్దతు పలకడం, పార్టీ ఆదేశాలు పాటించనందు వల్ల జనసేన పొలిటికల్ ఎఫైర్ కమిటిలో చర్చించిన పిదప రాజోలు ఎమ్మెల్యే శ్రీ రాపాక ప్రసాద్ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని టీ చంద్రశేఖర్ గారు,
పార్టీ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి సస్పెండ్ చేయడం జరిగింది. ఇక నుంచి ఆయన మాటలకు నిర్ణయాలకు, జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదని తెలియచేస్తూ ఉన్నాం. రాపాక వరప్రసాద్ గారికి జగన్మాత ఆసేస్సులు ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఇట్లు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షులు.” అంటూ సోషల్ మీడియాలో జనసేన లెటర్ హెడ్ మీద ముద్రించిన ఒక ఫోటో,
పవన్ కళ్యాణ్ సంతకంతో వైరల్ గా మారింది. దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది ఫేక్ లెటర్ అని ఆయనపై జనసేన వ్యవహారాల కమిటీ ఏ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ నిజమైంది కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. పార్టీ మీడియా గ్రూప్‌ల నుంచి మాత్రమే సందేశాలను, ప్రెస్నోట్లను విడుదల చేస్తామని స్పష్టం చేసింది.