ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసిన తరువాత టీడీపీ, వైసీపీలు ఎవరికెన్ని సీట్లోస్తాయో లెక్కేస్తూ బిజీగా ఉంటే, జనసేన మాత్రం సోదిలో లేకుండా పోయింది. ఎన్నికలు పూర్తి కాగానే పవన్ పార్టీ వ్యవహారాలపై పెద్దగా శ్రద్ద చూపట్లేదు. జనసేన పార్టీ అధినేత హైదరాబాద్ చేరుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు.అధినేత అలసత్వంతో జనసేన పార్టీ ఆఫీసులు ఖాళీ అవుతున్నాయి. ఎన్కికలు ముగిసిన తరువాత పవన్ చేసింది పెద్దగా ఏమీలేదు.. పార్టీ అభ్యర్థులతో సోమవారం నాడు మీటింగ్ తప్పితే. ఎన్నికలు ముగిసిన వారం రోజుల్లోనే పార్టీ కార్యాలయాలకు టులెట్ బోర్డు పెట్టేస్తున్నారు.
పార్టీ కీలక నేతలు ఒక్కక్కరుగా దూరం కావడం చూస్తున్నాం. ఎన్నికలు ముగిసినాక అద్దేపల్లి శ్రీధర్ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు. ఇప్పటివరకు పార్టీ అన్నీ తానై వ్యవహరించిన శ్రీధర్ దూరం కావడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
తాజా సర్వేల ప్రకారం జనసేన 2 నుండి 4 స్థానాలు గెలవచ్చు. గెలిచిన తరువాత ఎవరికి మద్దతు తెలుపుతారో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఇంకా ఎన్నికలు పూర్తి కాగానే పవన్ పార్టీ వ్యవహారాలపై పెద్దగా శ్రద్ద చూపకపోవడం జనసైనికుల నిస్సత్తువకు కారణం. పవన్ సినిమా తీయడానికి రెడీ అయిపోతున్నాడనే సమాచారంతో నేతలు మరింత ఢీలా పడిపోతున్నారు.