బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి కాసేపటి క్రితమే హైదరాబాద్ లని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహం వద్దు రోడ్డు మార్గంలో రానున్నారు. అక్కడి నుంచి జరిగే క్యాడిల్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి కారణంగా పలు ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షల ప్రకారం రాష్ట్రంలో ర్యాలీలు, ధర్నాలు, బహిరంగ సభలను నిషేధం. అయితే ఇప్పటికే హైదరాబాద్ లోని నార్త్ జోన్ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టు కు చేరుకున్నారు.
రాష్ట్రంలో అమలు అవుతున్న ఆంక్షలను వివరించనున్నారు. అలాగే కరోనా వ్యాప్తి కారణంగా విధించిన ఆంక్ష వల్ల ర్యాలీకి అనుమతి లేదని తెలపనున్నారు. ర్యాలీని విరమించుకోవాలని సూచించనున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ నిర్వహిస్తామని దీమా వ్యక్తం చేస్తుంది. దీంతో హైదరాబాద్ నగరంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. అయితే జేపీ నడ్డ ర్యాలీలో పాల్గొంటే నార్త్ జోన్ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.