ఈనెల 16న ఢిల్లీలో కేఏ పాల్ మౌన దీక్ష

-

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ ఈ నెల 16న ఢిల్లీలో మౌన దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల విభజన హామీల అమలు కోసం ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద ఈ మౌన దీక్ష ఉంటుందని తెలిపారు. తాను చేయబోయే మౌనదీక్ష ఆందోళనలో అందరూ కలిసి రావాలని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు. జూలై 16న చేపట్టబోయే మౌనదీక్షకు ఏపీ, తెలంగాణకు చెందిన అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నారు.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోదండరామ్ సహా అందరూ రావాలనీ అన్నారు. తాను చేస్తున్న దీక్ష కోసం అవసరమైతే సీఎం లకు ప్రత్యేక విమానాలు పంపిస్తామన్నారు. తనని తెలంగాణకు ముఖ్యమంత్రిని చేస్తే వేల కోట్ల పెట్టుబడులు తెస్తానని అన్నారు. ప్రధాని అయ్యే అవకాశం వస్తే ప్రపంచానికి ప్రజాశాంతి పార్టీ, తెలుగువారి సత్తా తెలియజేస్తామన్నారు. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా, తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version