పాలేరు రైతు కోసం ‘ కందాళ ‘ భగీర‌థ ప్ర‌య‌త్నం స‌క్సెస్‌… ఎన్నిక‌ల్లో కొలిసొచ్చేనా…!

-

సాగులేనిదే.. జీవిత‌మే లేదు. ఎన్ని కోట్ల సంప‌ద ఉన్నా.. స‌మ‌యానికి గుప్పెడు అన్నం తిన‌క‌పోతే..ఈ జీవుడు బ‌తికేదేలేదు. మ‌రి ఆ గుప్పెడు గింజ‌లు పండించే రైత‌న్న‌ను ప‌ట్టించుకునేవారు ఎవ‌రు? అంటే.. ప్ర‌జాప్ర‌తినిధే. కానీ, ఎంత మంది ఇలా అన్న‌దాత‌ల‌కు ఆప‌న్న హ‌స్తం అందిస్తున్నారంటే.. ప్ర‌శ్నలే మిగులుతాయి. అయితే.. పాలేరు ఎమ్మెల్యేగా ఉన్న రైతు బిడ్డ కందాళ ఉపేంద‌ర్‌రెడ్డి స్థానిక రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించడంలో అప‌ర భ‌గీర‌థుడిగా వ్య‌వ‌హ‌రించిన మాట నిజం.

గోదావ‌రిని మ‌ళ్లించి..

నిజానికి పాలేరులో ఒకప్పుడు కరువు కటాకాలు క‌నిపించేవి. ఎటు చూసినా ఎండిపోయిన పొలాలు.. వాటిలో మొలిచిన ప‌ల్లేరు మొక్క‌లే ద‌ర్శ‌న మిచ్చేవి. దీంతో రైతులు వ్య‌వ‌సాయం మానుకోవ‌డ‌మో లేదా హైద‌రాబాద్‌కు చిన్న‌చిన్న ప‌నుల కోసం వ‌ల‌స పోవ‌డమో స‌హ‌జంగా మారింది. కానీ, తెలంగాణ వచ్చాక ముఖ్యంగా కందాళ ఎమ్మెల్యే అయ్యాక‌.. పాలేరు ద‌శ మారింది. నీటి కరువు తీరింది.

ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదుల మధ్యన ఉన్న ఖమ్మం జిల్లాలో ఉన్న పాలేరును ఎమ్మెల్యే కందాళ నీటి ఎద్ద‌డి లేని ప్రాంతంగా తీర్చిదిద్దారు. నిజానికి ఒక‌ప్పుడు ‘తలాపునే గోదారి.. తాగేందుకు నీరేది’ అనే సామెత వినిపించేది. ఎగువన గోదావరి.. దిగువన కృష్ణా నది నీటితో పాలేరు పారుతున్నా, భ‌క్త‌రామ‌దాసు ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఉన్నా నియోజ‌క‌వ‌ర్గం మొత్తానికి నీళ్లు లేని నిస్సహాయ‌స్థితిని ఇక్క‌డి అన్న‌దాత‌లు ఎదుర్కొన్నారు.

ప్రాజెక్టులు , కాలువలు లేని ప‌రిస్థితి వారికి క‌న్నీరు పెట్టించేది. ఈ క్ర‌మంలో ఆయా స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టిన కందాళ‌.. స్థానిక రైతుల స‌మ‌స్య‌లు విని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. దీనిలో భాగంగా ఎగువ‌న ఉన్న గోద‌వ‌రిని పాలేరులో పారించేలా చేశారు. బ‌య్యారం చెరువు ద్వారా గోదారి నీళ్ల‌ను పాలేరుతో అనుసంధానం చేసేవ‌ర‌కు నిద్ర‌పోలేదు. సీఎం కేసీఆర్ స్థాయిలో ఒత్తిడి చేసి మ‌రీ ఈ విష‌యంలో స‌క్సెస్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో కరువుతో అల్లాడిన కూసుమంచి, తిరుమలాయ పాలెంలో ఇప్పుడు రెండు పంటలతో కళకళలాడుతున్న పరిస్థితి నెలకొంది.

రెండు జీవనదులతో పాలేరు సాగునీటి కష్టాలు తీర్చాల‌నే సంక‌ల్పాన్ని చెప్పుకొన్న ఎమ్మెల్యే కందాళ గోదావ‌రి – కృష్ణానీటిని నియోజ‌క‌వ‌ర్గానికి అనుసంధానం చేసి తన నియోజకవర్గంలోని రైతులకు పుష్కలంగా నీరందించారు. దీంతో పాలేరు రైతులు బంగారు పంటలు పండించారు. ఆధునిక పాలేరుకు బాటలు పరిచి, సొంత గడ్డ పాలేరు అభివృద్ధి కోసం శతవిధాల ప్రయత్నించిన కందాల‌ పట్టుదలతో ముందుకు సాగారు.

పాలేరు సాగు ఇప్పుడు ఖమ్మంలోనే రోల్ మోడల్ గా నిలిచింది. కరువును తరిమికొట్టి సిరులు కురిపిస్తోంది.

ఇవీ సాధించింది..

  • పాలేరులో అన్ని చెరువులను బాగు చేసి చేపలను పెంచి కేజ్ కల్చర్ తో 6 ఏళ్లుగా నీలి విప్లవం సాగుతోంది.
  • నియోజకవర్గంలో మత్స్య పరిశోధనా కేంద్రం, మత్య్స కళాశాల మంజూరు చేయించారు.
  • నియోజకవర్గంలో 70వేల ఎకరాలను సాగులోకి తెచ్చారు.
  • భక్తరామదాసు ప్రాజెక్టుతో కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ముదిగొండ మండలాల్లోని వ్యవసాయానికి పూర్తి స్థాయిలో సాగునీరందించారు.
  • పాలేరులో కాలువను తవ్వించి సామర్థ్యం పెంచి ఏకంగా 90వేల ఎరాల్లో సాగునీరు అందించారు.

గోదావ‌రి నీరు ఎలా తెచ్చారంటే..

  •  బయ్యారం పెద్ద చెరువు నుంచి వస్తున్న గోదావరి జిల్లాలు.. అక్కడి నుంచి బయన్నగూడెం వాగులోకి.. గ్రావిటీ ద్వారా ఉర్లు గొండ గ్రామంలోని పాలేరులో కలుస్తున్నాయి.
  • కృష్ణ పరివాహకంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ.. గోదావరి జలాలను మళ్లించడం ద్వారా ఇక్కడి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడగలిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version