ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కవితకు రెండ్రోజుల కిందట సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.బుధవారం హైదరాబాద్ చేరుకున్న ఆమె నేరుగా నందిహిల్స్‌లోని నివాసానికి వెళ్లి అక్కడే తన సోదరుడు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి సమయం గడిపారు. తాజాగా కవిత తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ నివాసముంటున్న ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కొద్దిసేపటి క్రితమే బయలు దేరారు. ఆమె వెంట పలువురు కుటుంబసభ్యులు, నేతలు, పార్టీ కార్యకర్తలు కూడా వెళ్లినట్లు సమాచారం.
సుమారు 10 రోజుల పాటు కవిత ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఉంటారని తెలుస్తోంది. అనంతరం ఆమె కార్యకర్తలకు అందుబాటులోకి వస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. పది రోజుల తర్వాత అందరికీ అందుబాటులోకి వస్తానని అప్పటివరకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సహకరించాలని ఎమ్మెల్సీ కవిత కోరినట్లు తెలుస్తోంది. సుమారు 150 రోజులకు పైగా జైలు జీవితం గడిపిన కవిత ఎట్టకేలకు విడుదలయ్యారు. ఆమె తిరిగి హైదరాబాద్‌కు వచ్చాక నేరుగా తండ్రి దగ్గరకే వెళ్తారని అంతా భావించారు. కానీ, ముందు హైదరాబాద్ ఉండే తన కుటుంబసభ్యులను కలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు.త్వరలోనే కవిత యాక్టివ్ పాలిటిక్స్‌లోకి అడుగుపెడతారని సమాచారం.