తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయడానికే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ధరణి చట్టాన్ని తెచ్చారని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల కళ్లలో నీళ్లు రాకుండా చూసుకోవడానికి.. వారు కోల్పోయిన భూములను మళ్లీ తీసుకొచ్చి రేవంత్ సర్కార్ రైతుల కళ్లలో నీళ్లను తుడుస్తుందని ఆమె తెలిపారు.
ఇప్పుడు రైతులకు అలాంటి కష్టాలు ఉండవని ఆమె పేర్కొన్నారు.అధికారులే ఇంటి వద్దకు వచ్చి సామాన్యులు, రైతుల భూ సమస్యలను పరిష్కరిస్తారని ఆమె వెల్లడించారు. ఇదిలాఉండగా, గత ప్రభుత్వం తెచ్చిన ధరణి ద్వారా చాలా మంది రైతులు తమ భూ హక్కులను కోల్పోయి రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.