త్వరలో బీఆర్ఎస్ లోకి ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు : కేసీఆర్

-

ఆంధ్రప్రదేశ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్​లో చేరేందుకు ముందుకొస్తున్నారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. విశాఖ ఉక్కును కేంద్రం ప్రైవేటీకరిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్‌ రాష్ట్ర సమితి ఏపీ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబును జాతీయస్థాయిలో వినియోగించుకుంటామని చెప్పారు. తమ పీఠాల కిందికి నీళ్లు వస్తాయనుకునే వాళ్లు చాలా అంటారని.. వాటిని పట్టింకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ తెలిపారు.

సంక్రాంతి తర్వాత ఏపీ నుంచి బీఆర్ఎస్​లోకి భారీగా చేరికలు ఉంటాయని కేసీఆర్ తెలిపారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కూడా చేరతామంటూ ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. ఏపీలో సిసలైన ప్రజా రాజకీయాలు రావాలని అన్నారు. ఎంత ఖర్చయినా విశాఖ ఉక్కును మళ్లీ పబ్లిక్ సెక్టార్‌లోకి తీసుకొస్తామన్నారు. మోదీ ప్రభుత్వానిది ప్రైవేటీకరణ విధానమైతే.. తమది జాతీయీకరణ విధానమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఏపీతోపాటు మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశా, హరియాణ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కమిటీలు సిద్ధమయ్యాయని కేసీఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా 6 లక్షల 49 వేల గ్రామాలు, 4 వేల 3 వందల అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమాంతరంగా బీఆర్​ఎస్ విస్తరిస్తుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version