కేశినేని ఎపిసోడ్: సీఎం రమేష్ టీడీపీని ముంచేస్తారా?

-

తెలుగుదేశం పార్టీలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం బాగా హాట్ టాపిక్ అవుతున్న విషయం తెలిసిందే..అదేదో సీరియల్ మాదిరిగా సాగినట్లు రోజుకో ఎపిసోడ్ తెరపైకి వస్తుంది. కేశినేని రోజుకో సంచలనంతో ముందుకొస్తున్నారు. సొంత పార్టీపైనే తిరుగుబాటు జెండా ఎగరవేస్తూ ముందుకెళుతున్నారు. ఇప్పటికే సొంత పార్టీ నేతలపైనే కేశినేని పలు సందర్భాల్లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే….ఇటీవల తనకు వ్యతిరేకంగా తన తమ్ముడునే టీడీపీ అధిష్టానం ప్రోత్సహించడంపై కామెంట్ చేశారు. అలాగే తన ఎంపీ వి‌ఐ‌పి స్టిక్కర్ ని ఉపయోగించుకుని…కేశినేని శివనాథ్ హల్చల్ చేస్తున్నారని పరోక్షంగా ఆరోపించారు.

అయితే దీనిపై కేశినేని శివనాథ్ వివరణ కూడా ఇచ్చారు…తన అన్న ఐడెంటీతో తాను తిరగడం లేదని చెప్పుకొచ్చారు..అలాగే తాను ఈ సీటు అడగలేదని, చంద్రబాబు ఏం చెబితే అది చేస్తానని అన్నారు. ఇక ఇలా జరుగుతూ ఉండగానే కేశినేని మరొకసారి..ఢిల్లీలో ఆఫ్ ది రికార్డుగా టీడీపీపై విమర్శలు చేశారు..టీడీపీలో ఏక్ నాథ్ షిండే ఉన్నారని, అది కూడా టీడీపీ నుంచి వెళ్ళిన ఎంపీ సీఎం రమేశ్ అని చెప్పారు. బీజేపీలో ఉన్న రమేశ్…నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ 60-70 సీట్లు గెలిస్తే…వాటిని లాగేసుకుని బీజేపీలోకి తీసుకెళ్లి..టీడీపీని లేకుండా చేస్తారని అన్నారు.

అలాగే నెక్స్ట్ టీడీపీ అధికారంలోకి రాదని, చంద్రబాబు ఎప్పుడు లోఫర్లు, బ్రోకర్లు మాటలే వింటారని మాట్లాడారు. ఇక తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై తాజాగా కేశినేని స్పందిస్తూ…తనని బీజేపీలోకి, వైసీపీలోకి పంపించే బదులు…చెప్పింది అర్ధం చేసుకొని…పార్టీని బలోపేతం చేసి…పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు కదా అని కౌంటర్ ఇచ్చారు. ఇలా టీడీపీలో కేశినేని ఎపిసోడ్లు నడుస్తున్నాయి.

అయితే టీడీపీలో సీఎం రమేశ్ టాపిక్ పై చర్చలు నడుస్తున్నాయి…గతంలో రమేశ్ టీడీపీలో ఉండగా ఆయనకు కేశినేనితో పడేది కాదని మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇప్పుడు బీజేపీలో ఉన్నా సరే టీడీపీలో జరిగే ప్రతి విషయం రమేశ్ కు తెలుస్తుందని, టీడీపీలో అడుగడుగున రమేశ్ మనషులు ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఎప్పటికైనా రమేశ్ వల్ల టీడీపీకి డ్యామేజ్ ఖాయమని సొంత పార్టీలోనే కొందరు మాట్లాడుకునే పరిస్తితి. మరి చూడాలి టీడీపీలో కేశినేని ఇంకా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version