బెజవాడ సీటుపై కేశినేని తగ్గేదెలే..మళ్ళీ రచ్చ.!

-

హాట్ హాట్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండే విజయవాడలో ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఎప్పటినుంచో చర్చనీయాంశంగా ఉన్న విషయం తెలిసిందే. టి‌డి‌పిలోనే ఉన్నా..అదే టి‌డి‌పి నేతలతో ఎంపీకి పడదు. విజయవాడలో టి‌డి‌పి నేతలంతా ఓ గ్రూపుగా చేరి కేశినేనికి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇదే సమయంలో కేశినేని సైతం ఆ టి‌డి‌పి నేతలపై ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ ఉంటారు.

అలాగే నెక్స్ట్ విజయవాడ ఎంపీగా కేశినేనిని తప్పించి..ఆయన సోదరుడు కేశినేని చిన్నిని బరిలో దింపేలా చేయాలని బుద్దా వెంకన్న, బోండా ఉమా, దేవినేని ఉమా లాంటి వారు చూస్తున్నారు. కానీ కేశినేని నాని మాత్రం నెక్స్ట్ తానే విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానని, గెలిచి తీరాతనని అంటున్నారు. పైగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచే సత్తా తనకు ఉందని చెబుతున్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా కేశినేని సఖ్యతగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవల నారా లోకేష్ పాదయాత్ర విజయవాడ నగరంలో జరిగిన కేశినేని రాలేదు. పాదయాత్ర మొత్తం బాధ్యతలు కేశినేని చిన్ని చూసుకున్నారు.

అయితే కేశినేని నాని..చంద్రబాబుతో సఖ్యతగానే ఉంటున్నారు. తాజాగా విజయవాడ వెస్ట్ లో టి‌డి‌పి నేత బేగ్ పుట్టిన రోజు వేడుకలకు హాజరై..బేగ్‌ని ఎలాగైనా ఎమ్మెల్యేగా చేస్తానని, అర్హత లేని వ్యక్తుల నుంచి విజయవాడ వాసులకు విముక్తి కావాలంటూ..పరోక్షంగా బుద్దా, బోండాలని విమర్శించారు.

నెక్స్ట్ తానే పోటీ చేస్తానని, గెలుస్తానని అంటున్నారు. దీంతో విజయవాడ ఎంపీ సీటు విషయంలో ట్విస్ట్‌లు నడుస్తున్నాయి. అసలు కేశినేని నాని టి‌డి‌పి నుంచి పోటీ చేస్తారా? లేక వైసీపీలోకి వెళ్తారా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. ఇటు చంద్రబాబు కూడా విజయవాడ ఎంపీ సీటుపై త్వరగా నిర్ణయం తీసుకుంటే బెటర్..లేదంటే పార్టీకే నష్టం.

Read more RELATED
Recommended to you

Exit mobile version