హుజూరాబాద్ పై కిష‌న్‌ రెడ్డి మౌనం.. అస‌లు కార‌ణం అదేనా..?

-

తెలంగాణ‌లో అన్ని పార్టీల‌కు ఇప్పుడు అతి ముఖ్య‌మైన ప‌ని ఏదైనా ఉంది అంటే అది హుజూరాబాద్ ఉప ఎన్నిక అనే చెప్పాలి. ఎందుకంటే అనుకోని ప‌రిస్థితుల న‌డుమ వ‌చ్చింది అలాగే ఇప్పుడు అన్ని పార్టీలు మంచి జోరు మీద ఉన్నాయి. కాబ‌ట్టి ఏ న‌లుగురు క‌లిసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మ‌రి అంత‌లా హీటు పెంచుతున్న ఈ ఉప ఎన్నిక‌పై ఓ కీల‌క నేత మౌనంగా ఉంటున్నారు. ఈట‌ల రాజేంద‌ర్‌ను మొద‌టి నుంచి బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ వేసిన కేంద్ర‌మంత్రి కిష‌న్‌ రెడ్డి kishan reddy మాత్రం మౌనంగా ఉండ‌ట‌మే ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అన్ని పార్టీలు దీన్ని చావోరేవో అన్న‌ట్టుగానే ప్ర‌చారం చేస్తుంటే ఇక ముఖ్య నేత‌గా ఈట‌ల పోటీలోకి దిగుతున్న బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్న కిష‌న్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మొద‌టి నుంచి ఈట‌ల రాజేంద‌ర్‌ను పార్టీ చీఫ్ బండి సంజ‌య్‌కు చెక్ పెట్టేందుకే తీసుకొచ్చార‌నే ప్ర‌చారం కిష‌న్ రెడ్డిపై ఉంది. కానీ అనుకోకుండా ఈట‌ల బండి వ‌ర్గానికి ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో కిష‌న్ రెడ్డి సైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఇక తాను అనుకున్న‌ట్టుగానే ఇప్పుడు కేంద్ర మంత్రి అవ‌డంతో హుజూరాబాద్‌లో పార్టీ గెలుపు, ఓట‌ముల గొడ‌వ‌లోకి దిగ‌కుండా మౌనంగా ఉండాల‌ని భావిస్తున్నారంట‌. ఇందుకు కార‌ణం కూడా ఉంది. తాను ఎంట్రీ ఇచ్చి గెలిపించేందుకు కృషి చేస్తే ఆ క్రెడిట్ కాస్త మొద‌టి నుంచి ప్రచార బాద్య‌త‌లు చూసుకుంటున్న బండి సంజ‌య్‌ ఖాతాలోకి వెళ్తుంద‌ని భావిస్తున్నారంట‌. అందుకే మౌనంగా ఉంటే ఒక‌వేళ ఈట‌ల ఓడిపోయినా ఆ ఎఫెక్ట్ బండి సంజ‌య్ మీద ప‌డి ఆయ‌న ప్ర‌భావం పార్టీలో త‌గ్గుతుంద‌ని కిష‌న్ రెడ్డి యోచిస్తున్న‌ట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version