ఐడీబీఐ బ్యాంక్ (IDBI Bank) లో మీకు ఖాతా ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా ఐడీబీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..ఐడీబీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది.
వాటి వివరాలలోకి వెళితే.. రూ. 2 కోట్ల కన్నా తక్కువ రిటైల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఈ నూతన వడ్డీ రేట్లు వర్తిస్తాయని ఐడీబీఐ బ్యాంక్ తెలిపింది. ఇది ఇలా ఉంటే ఐడీబీఐ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 20 సంవత్సరాల మెచ్యూరిటీతో ఉంటాయి.
ఈ వ్యవధిలోని అన్ని ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.7% నుంచి 4.8% వరకు వడ్డీ రేట్లను అమలు చేయడం జరుగుతుంది. ఇక ఎంత వడ్డీ వస్తుంది అనేది చూస్తే.. 7 నుంచి 14 రోజులు, 15 నుండి 30 రోజుల వ్యవధి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.7% వడ్డీని అందిస్తోంది.
అదే 31 నుంచి 45 రోజులైతే.. 2.8% వడ్డీని ఇస్తుంది. 31 నుంచి 45 రోజులైతే 2.8 శాతం వడ్డీ వస్తుంది.
46 నుంచి 90 కి 3 శాతం, 91 రోజుల నుంచి 6 నెలలకి 3.5% వడ్డీ అమలు చేస్తుంది.
ఆరు నెలల నుంచి ఒక సంవత్సరంకి 4.3% వడ్డీ రాగా ఏడాది నుంచి మూడేళ్లకి 5.1% వడ్డీ వస్తుంది. ఐదేళ్ల నుంచి 10 సంవత్సరాలకి 5.25%, 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకి 4.8% వడ్డీ రేటు అందజేస్తుంది. సీనియర్ సిటిజన్లకు 3.2% నుంచి 5.3% వరకు వడ్డీ రేట్లను ఇస్తోంది.