బాబు కుప్పం వదిలిపెట్టాల్సిందేనా!

-

టీడీపీ అధినేత చంద్రబాబు…తన కంచుకోట కుప్పం నియోజకవర్గాన్ని వదిలిపెట్టాల్సిందేనా? నెక్స్ట్ ఎన్నికల్లో బాబు తన సీటు మార్చుకోవాల్సిందేనా? అంటే ఇప్పుడు కుప్పంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలని గమనిస్తే…అక్కడ బాబుకు వ్యతిరేక వాతావరణం ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది. కుప్పంలో వైసీపీ పాగా వేసే దిశగా ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. అసలు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్‌గా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా బాబుకు చెక్ పెట్టేసి కుప్పంలో వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన వ్యూహాలతో కుప్పంలో బాబుకు చెక్ పెట్టే దిశగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించారు. దీంతో కుప్పంలో బాబు హవా కాస్త తగ్గినట్లు కనిపించింది. ఇదే సమయంలో కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ కైవసం చేసుకునే దిశగా అడుగులేసింది. అయితే మున్సిపాలిటీలో వైసీపీకి చెక్ పెట్టాలని చంద్రబాబు ధీటుగా వ్యూహాలతో ముందుకొచ్చారు.

కానీ తాజాగా కుప్పం మున్సిపాలిటీలో జరిగిన పోలింగ్ బట్టి చూస్తే అధికార వైసీపీకే లీడింగ్ వచ్చేలా ఉంది. దాదాపు 76 శాతంపైనే పోలింగ్ నమోదైంది. అయితే ఎక్కువ శాతం వైసీపీకి అనుకూలంగానే జరిగిందని విశ్లేషణలు వస్తున్నాయి. అంటే కుప్పం మున్సిపాలిటీనే వైసీపీ కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వైసీపీ పూర్తిగా అధికార బలాన్ని ఉపయోగించుకుందనే చెప్పొచ్చు.

ఇక దొంగ ఓట్లు కూడా ఎక్కువ పడ్డాయని అంటున్నారు. సరే ఏది ఎలా జరిగినా కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలిచేలా ఉంది. అక్కడ కూడా గెలిచేస్తే…నెక్స్ట్ ఎన్నికల్లో కుప్పం బరిలో బాబుకు గెలవడం టఫ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు..అందుకే బాబు నెక్స్ట్ నియోజకవర్గాన్ని మార్చేస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ బాబు అంత తేలికగా నియోజకవర్గాన్ని మార్చడం జరిగే పని కాదు. స్థానిక ఎన్నికలు వేరు, సాధారణ ఎన్నికలు వేరు. కాబట్టి నెక్స్ట్ కూడా బాబు కుప్పం బరిలోనే ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version