రామ మందిరాన్ని ఉచితంగా కట్టిస్తాం;ఎల్ అండ్ టీ…!

-

హిందువులు పవిత్రంగా భావించే రామ జన్మభూమి తీర్పు అనుకూలంగా వచ్చిన నేపధ్యంలో రామాలయ నిర్మాణం విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది. ఎప్పుడు నిర్మిస్తారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 ఎన్నికల నాటికి దీని నిర్మాణం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. హిందుత్వ సంస్థలు కూడా ఈ విషయంలో అదే మాట మాట్లాడుతున్నాయి. కేంద్ర పెద్దలు కూడా అదే చెప్తున్నారు.

ఈ తరుణంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించిన డీజైన్‌తో పాటు ఆలయ నిర్మాణాన్ని కూడా ఉచితంగా చేయడానికి ఆ సంస్థ ఒప్పుకుందని ప్రముఖ హిందు సంస్థ విశ్వహిందూ పరిషత్ శనివారం కీలక ప్రకటన చేసింది. అయితే ఈ విషయమై ఆ సంస్థ ఎలాంటి ఒప్పందాలపై సంతకం చేసే అవకాశం లేదని అంటున్నారు.

ఆలయానికి సంబంధించి నిర్మాణాలన్నింటినీ కూడా ఉచితంగానే కట్టిస్తామని ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారని వార్తలు వస్తున్నాయి. విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి, రామతీర్థ క్షేత్ర ట్రస్టు బోర్డు సభ్యుడు చంపత్ రాయ్ ఎల్ అండ్ టీ సంస్థతో చర్చలు కూడా జరిపారని సమాచార. మార్చి మొదటి వారంలో జరగబోయే ట్రస్టు సమావేశానికి ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులను కూడా ట్రస్టు సభ్యులు  ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news