మార్కెట్ లో లగడపాటి సర్వేకు ఉన్న డిమాండే వేరు. అయితే.. ఆయన సర్వే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బెడిసికొట్టింది. ఆయన సర్వేలో వెల్లడించిన ప్రకారం ఫలితాలు రాలేదు. అంతా తారుమారైంది. ఆ తర్వాత మౌనంగా ఉన్న లగడపాటి మళ్లీ నోరువిప్పారు. ఈసారి ఏపీ ఫలితాలపై సర్వేను విడుదల చేస్తానని చెబుతూనే… తెలంగాణలో తన సర్వే ఎందుకు విఫలమైందో కూడా చెబుతారట.
మే 19న ఏపీ ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటిస్తారట లగడపాటి. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని శాసనసభ స్థానాలు, ఎన్ని పార్లమెంట్ స్థానాలు వస్తాయో ఆరోజే చెబుతారట. అంతే కాదు.. తెలంగాణ ఎన్నికల్లో తన ఎన్నికల ఫలితాల సర్వే ఎందుకు విఫలమైందో కూడా అదే రోజు చెప్తా.. అని లగడపాటి స్పష్టం చేశారు. చూద్దాం.. ఈసారైనా లగడపాటి సర్వే ఫలితాలు నిజమౌతాయో లేదో?